వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'కేసు పెట్టింది కేంద్రఅధికారి, 16 నెలలు జైల్లో ఉన్నా జగన్‌లో మార్పులేదు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పదహారు నెలల పాటు జైలులో ఉన్నా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం మారలేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం నాడు ధ్వజమెత్తారు.

విమానాశ్రయం మేనేజర్ పైన దాడి కేసులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి దాడి చేయకున్నా అతడిని అన్యాయంగా ఇరికించారని జగన్ చెప్పడం విడ్డూరమన్నారు. టిడిపి ప్రభుత్వం ఎంపీ మిథన్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డిలను అక్రమంగా జైల్లో పెట్టిందన్న జగన్ వ్యాఖ్యలను సోమిరెడ్డి తప్పుబట్టారు.

మిథున్ రెడ్డి పైన కేసు పెట్టింది తెలుగుదేశం పార్టీ నాయకులు కాదని, కేంద్ర అధికారి అని సోమిరెడ్డి అన్నారు. నిందితులను వెనుకేసుకు రావడం జగన్ నైజమని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పైన జగన్‌తో చర్చకు సిద్ధమన్నారు. మేం తప్పు చేశామని రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సోమిరెడ్డి సవాల్ చేశారు. అసెంబ్లీకి జగన్ ఆస్తుల వివరాలు ఇవ్వలేదన్నారు.

'No change in YS Jagan after jail life'

ఢిల్లీ జేఎన్ వర్సిటీ వీసీగా తెలుగు వ్యక్తి

ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) ఉప కులపతిగా తెలుగు వ్యక్తి, ప్రొఫెసర్ మామిడాల జగదీశ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు వర్సిటీ వీసీ పదవికి ఆయన పేరును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు.

ప్రస్తుతం ఐఐటీ ఢిల్లీలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఆచార్యునిగా జగదీశ్ పని చేస్తున్నారు. ఆయన స్వస్థలం తెలంగాణలోని నల్లగొండ జిల్లా మామిడాల గ్రామం. జగదీశ్‌తో పాటు ప్రొఫెసర్లు వీఎస్ చౌహాన్, ఆర్ఎన్‌కే బమేజాయి, రామకృష్ణ రామసామిల పేర్లను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ రాష్ట్రపతికి పంపింది.
చివరగా జగదీశ్ పేరుకే రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారని ఆ శాఖ వర్గాలు తెలిపాయి.

English summary
No change in YS Jagan after jail life, says Somireddy Chandramohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X