తగ్గేది లేదు, సర్ది చెప్పండి: సీమాంధ్ర నేతలకు డిగ్గీ క్లాస్

న్యూఢిల్లీ: తెలంగాణపై వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని, మీకేమైన సమస్యలు ఉంటే మంత్రివర్గ ఉపసంఘానికి చెప్పుకోవచ్చునని సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ గురువారం కుండబద్దలు కొట్టారు. ఆంటోని కమిటీ నివేదిక వచ్చేంత వరకే ఆగుతామని, ఉద్యమాన్ని శాంతింపచేయడానికి ఎలాంటి ప్రకటన అవసరం లేదని డిగ్గీ చెప్పినట్లుగా తెలుస్తోంది.

డిగ్గీ మాటల ద్వారా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఎంత ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినా కాంగ్రెసు పార్టీ అధిష్టానం మెత్తబడే అవకాశాలు లేనట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర విభజన నిర్ణయం నుంచి వెనక్కి తగ్గేది లేదని డిగ్గీ సీమాంధ్ర నేతలతో చెప్పారు. ఆంటోని కమిటీ నివేదిక వచ్చేంత వరకూ కేబినెట్ నోట్ తయారు కాకూడదన్న విజ్ఞప్తిని పరిశీలిస్తామని, అంతకుముంచి వెనక్కి పోవడానికి మాత్రం ఏమీ లేదన్నారు.

No going back on Telangana: Diggy

తెలంగాణకు అనుకూలంగా అన్ని పార్టీలు లేఖలు ఇచ్చాయని, అందరూ చెప్పిన తర్వాతే చిట్టచివరిగా సిడబ్ల్యూసి తీర్మానం జరిగిందన్నారు. మీ ఆందోళనలు, సమస్యలు, అనుమానాలను మంత్రివర్గ ఉపసంఘం చూసుకుంటుందన్నారు. నాయకుడు అనేవాడు ధైర్యం ఉండాలని, ప్రజలకు అంతే ధైర్యం చెప్పాలని, ఎవరికీ అన్యాయం జరగదనీ ప్రజలకు మీరు చెప్పాలని వారికి సూచించారు.

వారిని మీరే శాంతింపచేయాలని సూచించారు. అంతేతప్ప ప్రస్తుత ఉద్యమాన్ని శాంతింపజేయడానికి తమ తరఫున ఎలాంటి ప్రకటన చేసేది లేదని చెప్పారు. కాగా, త్వరలో దిగ్విజయ్ రాష్ట్రానికి రానున్నారు. ఆంటోని, అహ్మద్ పటేల్‌లు రారని, తాను, వీలైతే మొయిలీతో పాటు వస్తానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+