కేఈకి నీరు బంద్!: తోసుకున్న టీ ఎమ్మెల్యే, ఏపీ ఎంపీ

తెలంగాణ, ఏపీ ఎమ్మెల్యే, ఎంపీల తోపులాట
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పార్లమెంటు సభ్యులు మాగంటి బాబు, ఖమ్మం జిల్లాకు చెందిన అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పరస్పరం తోసుకున్నారు. వీరిద్దరి మధ్య గురువారం తోపులాట చోటుచేసుకుంది.
పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరులో జరిగిన పోలవరం ముంపు అంశంపై సమావేశం జరిగింది. రివ్యూ సమావేశాన్ని ఆపాలంటూ ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలోని తెలంగాణవాదులు అడ్డుకున్నారు. అలాగే స్థానిక సమస్యల పైన ఎంపీని నిలదీశారు.
ఇప్పుడు తెలంగాణ ఏంటి? ఈ మండలాలు ఆంధ్రాలో కలిశాయని మాగంటి బాబు సమావేశాన్ని కొనసాగించారు. దీంతో, ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, ఎంపీ బాబుల మధ్య తోపులాట జరిగింది. దీంతో, రివ్యూ మీటింగ్ రసాభాసగా మారింది. సమావేశం అర్ధాంతరంగా నిలిచిపోయింది.












Click it and Unblock the Notifications