రెచ్చిపోయారు: చదువుకోమని పంపిస్తే... జగన్‌పై వైఎస్ చెప్పారిలా! రోజాకు షాక్ (పిక్చర్స్)

హైదరాబాద్: ఏపీ శాసన సభలో మంగళవారం ప్రత్యేక హోదా పైన చర్చ సందర్భంగా అదికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆవేశకావేశాలు కనిపించాయి. హెచ్చరికల వరకూ వెళ్లింది. ఓ దశలో ఇద్దరు సభ్యులు నెట్టుకునే పరిస్థితి వచ్చింది. సభాపతి కోడెల, సిఎం చంద్రబాబు వారించారు.

రూ.లక్ష కోట్లు దిగమింగిన విషయం మరిచి జగన్ మాట్లాడితే ఎలా అని ఎమ్మెల్యే కాగితపు వెంకట్రావు మండిపడ్డారు. తండ్రి శవం ఉండగానే సిఎం కావాలంటూ ఎమ్మెల్యేల సంతకాలు తీసుకున్న జగన్ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు... ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారని వైసిపి ఆరోపించింది.

ఓ సమయంలో వైసిపి ఎమ్మెల్యే నారాయణ స్వామి అధికార పార్టీ వైపు దూసుకు వచ్చారు. అధికార పక్షం నుంచి ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు ముందుకు వచ్చారు. విప్ కూన రవి కుమార్, వైసిపి సభ్యుడు జ్యోతుల నెహ్రూ వారికి సర్ది చెప్పారు.

 ఏపీ అసెంబ్లీ

ఏపీ అసెంబ్లీ

అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధం, మాటల తూటాల మధ్య ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం నాడు శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.

ఏపీ అసెంబ్లీ

ఏపీ అసెంబ్లీ

శాసనసభ ప్రారంభం నుండి ఇరు పక్షాల మధ్య వాడి వేడి చర్చ జరిగింది. ఒక దశలో ఇరు పక్షాలు సవాళ్లకు దిగాయి. నిందలు, ఆరోపణలతో పాటు తెలంగాణ నాయకులపైనా, తెలంగాణ రాష్ట్రప్రభుత్వ తీరుపైన కూడా శాసనసభలో చర్చ జరిగింది.

ఏపీ అసెంబ్లీ

ఏపీ అసెంబ్లీ

తొలుత ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు ప్రత్యేక హోదాపై సోమవారం ప్రారంభించిన ఉపన్యాసాన్ని రెండో రోజూ కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక పద్ధతి, విధానం లేకుండా రాష్ట్ర విభజన చేశారని అన్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు.

ఏపీ అసెంబ్లీ

ఏపీ అసెంబ్లీ

గతంలో దేశంలోని ఇతర రాష్ట్రాలను విభజన చేసినప్పుడు ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారని గుర్తు చేశారు. నాడు తమిళనాడులో ఉన్న ఎపిని, ఉత్తరాంచల్, జార్కండ్, ఛత్తీస్‌ఘ్ఢ్ రాష్ట్రాల ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా విభజించారని అన్నారు.

 ఏపీ అసెంబ్లీ

ఏపీ అసెంబ్లీ

కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విభజన చేసిందని అన్నారు. దాంతో ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోయిందని చెప్పారు. పోలవరం పూర్తి చేసుకునే శక్తి, సామర్ధ్యాలు తమకే ఉన్నాయని చంద్రబాబు అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ, పరిశ్రమలకు రాయితీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు.

 ఏపీ అసెంబ్లీ

ఏపీ అసెంబ్లీ

అనంతపురానికి సెంట్రల్ యూనివర్శిటీ, విజయనగరం జిల్లాకు గిరిజన వర్శిటీ రావల్సి ఉందని, 200 గ్రామాలకు పునరావాసం కల్పించాల్సి ఉందని సిఎం వివరించారు. విశాఖ చెన్నై కారిడార్ కోసం ఐదు వేల కోట్ల రూపాయిల రుణం మంజూరైందని చెప్పారు.

 ఏపీ అసెంబ్లీ

ఏపీ అసెంబ్లీ

ఇటీవల ప్రధానితో భేటీ సందర్భంగా ఇచ్చిన లేఖలో ప్రత్యేక హోదాపైనే ప్రధానంగా ప్రస్తావించామని చెప్పారు. తమిళనాడు, కర్నాటక, మహారాష్టత్రో సమానంగా ఎదిగేవరకూ కేంద్రం ఆదుకోవాలని ప్రధానిని కోరినట్టు వెల్లడించారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.

ఏపీ అసెంబ్లీ

ఏపీ అసెంబ్లీ


ప్రజలకు సేవకుడు, రక్షకుడిగా ఉంటూ, రాజీపడే ప్రసక్తే లేదని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం సహకారం అవసరమనే పొత్తు పెట్టుకున్నామని సిఎం చంద్రబాబు అన్నారు. తనకు ప్రలోభాలు, బలహీనతలు లేవని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధనకు సభ్యులు అంతా సహకరించాలని అన్నారు.

 ఏపీ అసెంబ్లీ

ఏపీ అసెంబ్లీ

ప్రధాని నిర్ణయం తీసుకుంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వెంటనే వస్తుందని వైసిపి అధ్యక్షులు జగన్ అన్నారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఎఐబిసి నిధులు వస్తాయని చెప్పారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణాళికా సంఘం రద్దుకు ఏడు నెలలు పట్టిందని అన్నారు.

అసెంబ్లీ ప్రాంగణంలో జెసి దివాకర్ రెడ్డి

అసెంబ్లీ ప్రాంగణంలో జెసి దివాకర్ రెడ్డి

మనం డిమాండ్ చేసి ఉంటే ఆనాడే ప్రణాళికా సంఘం ప్రత్యేక హోదాను ఆమోదించేది అని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు దేన్నైనా తనకు అనుకూలంగా మలచుకోవడంలో దిట్ట అని విమర్శించారు. కశ్మీర్‌కు హోదా ఉన్నా ప్రధాని మోడీ ప్యాకేజీ ప్రకటించారని గుర్తుచేశారు. కాగా, ముఖ్యమంత్రి రాజీనామా చేసినా హోదా రాదని జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ హోదా తెస్తానంటే తాను రాజీనామా చేస్తానని సవాల్ చేశారు.

ఆందోళన

ఆందోళన

ఏపీలో ఉద్యోగాలను భర్తీ చేయాలని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ రద్దు చేయాలని, పలు శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని అసెంబ్లీ ఎదుట ఐక్య వేదిక ఆందోళన.

టిడిపి ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతున్న సమయంలో వైసిపి ఎమ్మెల్యే రోజా వెళ్లి పక్కన నిలుచున్నారు. అంతరాయం కలిగిస్తోందని ఆగ్రహించిన ఆయన.. మాట్లాడమ్మా అంటూ తన ప్రసంగం ఆపి మైకు నుంచి పక్కకు జరిగారు. రోజా వెంటనే మైక్ అందుకొని ఓటుకు నోటు అంటూ చెప్పబోతుండగా కట్ అయింది.

ఓ సమయంలో జగన్ తాను కొత్త తరం వాడినని, చంద్రబాబు పాత తరం వాడన్నారు. మామకు వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యాడన్నారు. దీనికి టిడిపి, చంద్రబాబు ఘాటుగానే స్పందించారు. చంద్రబాబు మాట్లాడుతూ.. మీ వాడు ఏం చేస్తున్నాడని నేను ఓసారి రాజశేఖర రెడ్డిని అడిగితే, తిరుగుటపాలో అమెరికా నుంచి వచ్చాడని చెప్పాడని, మా పిల్లాడు మాత్రం అమెరికాలో చదువు పూర్తి చేసుకొని వచ్చాడన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+