కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

5 వేల కోట్ల కాదు 9 వేల కోట్లు, పేర్ని నాని అసత్యాలు వల్లెవేశారు, అభివృద్ధితో సంపద: చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

అమరావతి రాజధానిపై మంత్రి పేర్ని నాని అసత్యాలు వల్లించారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రాజధాని మార్పుపై 29 గ్రామాల ప్రజలే కాదు 5 కోట్ల మంది ఆంధ్రులు ఆలోచించాలని సూచించారు. 13 జిల్లాలకు కావాల్సిన ఆదాయం సమాకూర్చే రాజధాని అమరావతి అని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం లక్షా 9 వేల కోట్ల ఎక్కడినుంచి వస్తాయని మంత్రి అడిగారని, సంపదను సృష్టిస్తే ప్రభుత్వానికి వ్యక్తులకు ఆదాయం వస్తోంది అని చెప్పారు. మంత్రివర్గ సమావేశం తర్వాత మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడిన తర్వాత.. చంద్రబాబు స్పందించారు.

ఐదేళ్లలో 5 వేల కోట్లు, లక్షా 10 కోట్లకు ఎన్నేళ్లు కావాలి, అమరావతి రాజధాని నిర్మాణంపై మంత్రి పేర్నిఐదేళ్లలో 5 వేల కోట్లు, లక్షా 10 కోట్లకు ఎన్నేళ్లు కావాలి, అమరావతి రాజధాని నిర్మాణంపై మంత్రి పేర్ని

5 వేల కోట్లు కాదు..

5 వేల కోట్లు కాదు..

ఐదేళ్లలో తమ ప్రభుత్వం ఖర్చుచేసిన మొత్తం 5 వేల కోట్లు కాదని 9597 కోట్లు అని చంద్రబాబు పేర్కొన్నారు. ఏయే విభాగానికి ఎంత మొత్తంలో ఖర్చు చేశామో సవివరంగా పేర్కొన్నారు. రాజధాని ఇటుక ఇవ్వాలని కోరితే ఆన్‌లైన్ 55 వేల ఇటుకలు ఇచ్చారని గుర్తుచేశారు. అమరావతిలో రాజధాని లేకుండా జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అందుకోసమే రోజుకో కొత్త వాదనను తెరపైకి తీసుకొస్తున్నారని తెలిపారు.

అసత్య ప్రచారం..

అసత్య ప్రచారం..

తొలుత అమరావతిలో ఒకే సామాజికవర్గానికి చెందిన వారికి భూములు ఉన్నాయని చెప్పాని చంద్రబాబు గుర్తుచేశారు. తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి ఇవ్వలేదని, వరదలకు కొట్టుకుపోతుందని ప్రచారం చేసిందన్నారు. అసైన్‌మెంట్ భూముల్లో అవకతవకలు ఉన్నాయని.. రకరకాలుగా అబద్దాలతో దుష్ర్పచారం చేశారని చంద్రబాబు పేర్కొన్నారు.

అభివృద్దితో సంపద

అభివృద్దితో సంపద

తాము ఎంచుకొన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే సంపద వస్తోంది. సంపదతో ప్రభుత్వం, వ్యక్తులకు ఆదాయం సమకూరుతోంది.. ఇది ప్రాథమిక సూత్రం అని, అదీ కూడా జగన్ ప్రభుత్వానికి తెలియదా అని చంద్రబాబు అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నుంచి 65 శాతం ఆదాయం వస్తోందని గుర్తుచేశారు. రిజిస్ట్రేషన్ ద్వారానే 10 వేల కోట్లు వస్తున్నాయని పేర్కొన్నారు.

వినూత్న ఆలోచన

వినూత్న ఆలోచన

ఏపీలో ల్యాండ్ పూలింగ్ వినూత్న ఆలోచన అని చంద్రబాబు పేర్కొన్నారు. 29 వేల మంది రైతుల నుంచి 33 వేల ఎకరాల భూమి సేకరించి, వారికి ఇల్లు కట్టుకునేందుకు స్థలం, కమర్షియల్ అవసరాలకు భూమి ఇచ్చామని చెప్పారు. పదేళ్ల వరకు గ్యారంటీ ఇన్ కం కింద 10 శాతం చొప్పును ఏడాదికొసారి పెంచుతున్నామని చంద్రబాబు చెప్పారు. భూమిలేని వారికి నెలకు రూ.2500 ఇస్తున్నామని తెలిపారు. వారికి ఇచ్చే నగదును కూడా ఏడాదికి 10 శాతం పెంచుతున్నామని చెప్పారు.

ఆదర్శంగా

ఆదర్శంగా

అమరావతిలో చేపట్టిన ల్యాండ్ పూలింగ్‌ను మిగతా దేశాలు అధ్యయనం చేసే పరిస్థితి వచ్చిందని తెలిపారు. అమరావతిని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నగరాల్లో ఒకటి చేయాలనుకొన్నామని, ఆ దిశగా అడుగులు వేశామన్నారు. అమరావతిలో అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు భవనాలు నిర్మించం కదా.. మరో చోట భవనాలు ఎందుకు అని చంద్రబాబు ప్రశ్నించారు.

English summary
not 5k crore 9k crore tdp chief chandrababu naidu said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X