కెసిఆర్ అన్యాయమన్నా, జగన్‌లో స్పందన లేదు: బాబు

హైదరాబాద్: ఎపికి అన్యాయం జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సానుభూతి తెలిపినా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్‌లో స్పందన లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అన్నారు. ఎర్రచందనం ముఠాలను పక్కన పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎటిఎం దొంగలు, ఎర్రచందనం స్మగ్లర్లా తమపై ఆరోపణలు చేసేది అని ఆయన ప్రశ్నించారు.

తమ పార్టీ నాయకుడు పరిటాల రవి హత్య జరిగినప్పుడు తమను సభలో మాట్లాడనివ్వలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు. మంగళవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు.

 Not allowed to speak on Parital Ravi murder: Chandrababu

కొత్తగా అసెంబ్లీకి ఎన్నికైన శాసనసభ్యులు సభామర్యాదలు తెలుసుకోవాలని, సభలో ఏం చేసినా ఫరవా లేదనుకుంటే పొరపాటు అని ఆయన అన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉగ్రవాదులు, ఫాక్షనిస్టులు, రౌడీల జాడ లేదని ఆయన చెప్పారు.

శాంతిభద్రతలను ఎవరైనా తమ చేతిలోకి తీసుకుంటే తాము సహించబోమని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు సభా మర్యాదలను పాటించాలని, శాసనసభను మేమే శాసిస్తామనడం సరి కాదని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో అందరికీ ఒకటే చట్టమని, ఎవరినీ ఉపేక్షించబోమని అన్నారు.

అసెంబ్లీలో చట్ట ప్రకారం ఏ చర్చకైనా అనుమతిస్తామని, డిక్టేట్ చేస్తే ఒప్పుకునేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తనకైనా, ప్రధాన ప్రతిపక్ష నేతకైనా చట్టం ఒకే విధంగా వర్తిస్తుందని, చట్ట ప్రకారమే ఏ చర్చకైనా అసెంబ్లీ అనుమతించడం జరుగుతందే తప్ప ఇష్టారాజ్యంగా చర్చకు ఆమోదించలేమన్నారు.

నేరచరితులే నేరాలపై అసెంబ్లీలో చర్చించాలనడం విడ్డూరంగా ఉందని బాబు అన్నారు. తాము రాజకీయ హత్యలను ప్రోత్సహించలేదని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్, వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే గ్రామాల్లో ఎవరూ ఉండేవాళ్లు కాదన్నారు. 10 శాతం అవినీతి సొమ్మన్న జగన్ కోర్టులపై పరువునష్టం దావా వేస్తారా అని ప్రశ్నించారు.

స్మగ్లింగ్ నియంత్రణకు ప్రయత్నిస్తే 10 మంది చనిపోయారని, వీళ్లను వదిలేస్తే వెంకన్నను కబ్జా చే స్తారన్నారు. వీళ్ల అరాచకాలు చూసే ప్రజలు తనకు ఓటేశారని ఆయన తెలిపారు. జైళ్లో మనుషులు ఎందుకు చనిపోయారో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+