ఏడాదిలో ఒక్క ఆలయం కూడా పున:నిర్మించలేదు, వైరస్ వ్యాప్తికి మంత్రే కారణం: జనసేన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జనసేన విమర్శలు గుప్పించింది. అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతోన్న.. కూల్చిన ఆలయాలు ఎందుకు పున:నిర్మించలేదని ప్రశ్నించింది. ఆలయాలు నిర్మించాలని ధర్నా చేస్తే.. నిర్మిస్తామని మాట ఇచ్చి ఇప్పుడు తప్పుతారా అని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ ప్రశ్నించారు. దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై విమర్శలు గుప్పించారు.
తమతో ఆందోళన చేసిన శివస్వామిని వెల్లంపల్లి తిప్పుకున్నారని ఆరోపించారు. శివస్వామి తీరు చూస్తుంటే.. వైసీపీ సభ్యత్వం తీసుకున్నట్టు అనుమానం వస్తోందని తెలిపారు. కరోనా వైరస్ వల్ల ప్రపంచం వణికిపోతుంటే.. మంత్రి వెల్లంపల్లికి మాత్రం కాసుల పంట కురిపించిందని విమర్శలు చేశారు. తన అనుయాయులతో కలిసి రాజకీయం చేశారని మండిపడ్డారు.

అయితే కొందరు వైసీపీ నేతలకు కరోనా పాజిటివ్ వచ్చిందని గుర్తుచేశారు. వారిని క్వారంటైన్‌కు పంపించకుండా అడ్డుకున్నారని మహేశ్ తెలిపారు. మంత్రి పదవీలో ఉండి, నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. దీంతో పశ్చిమ నియోజకవర్గంలో కరోనా వైరస్ కేసులు పెరిగాయని గుర్తుచేశారు. కొందరు అభాగ్యులు చనిపోయారని.. ఇందుకు మంత్రి వెల్లంపల్లి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో అధికారులు కూడా ఒత్తిడికి తలొగ్గొద్దని.. నిబంధనల మేరకు నడచుకోవాలని సూచించారు. కలెక్టర్, పోలీసు కమిషనర్ సదరు నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Recommended Video
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications