కొత్తేముంది, కోర్టుకు వెళ్లడం అర్థంలేని పని: ఓటుకు నోటుపై తేలిగ్గా బాబు
విజయవాడ: ఓటుకు నోటు కేసు పైన ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మరోసారి స్పందించారు. ఈ కేసు పైన ఏసీబీ కోర్టుకు వెళ్లడం అర్థం లేని పని ఆయన తెలుగుదేశం పార్టీ నేతలతో వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది.
రెండు రోజుల క్రితం ఓటుకు నోటు పైన ఆయన స్పందించారు. తాజాగా, మరోసారి ఆయన సొంత పార్టీ నేతలతో ఈ అంశంపై మాట్లాడారని తెలుస్తోంది. దీనిని చాలా తేలిగ్గా తీసుకున్నారని తెలుస్తోంది. మూడు రోజులుగా ఓటుకు నోటు అంశం మళ్లీ రాజకీయ వేడిని రాజేసిన విషయం తెలిసిందే.

పార్టీ నేతలతో చర్చ సందర్భంగా ఓటుకు నోటు ప్రస్తావన వచ్చింది. ఈ కేసుల విషయంలో ఏసీబీ అధికారులు కోర్టుకు వెళ్లడంలో అర్థం లేదన్నారు. ఈ కేసు ప్రాతిపదికే చెల్లదని హైకోర్టు ఇది వరకే చెప్పిందన్నారు. ఈ కేసు విషయంలో ప్రతిపక్ష వైసిపి నేతలు అనవసరంగా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.
తాము రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కేసులు వేసి అభివృద్ధి పనులను వెనక్కు లాగాలని చూస్తున్నారని మండిపడ్డారు. కాగా, ఓటుకు నోటు అంశాన్ని చంద్రబాబు తేలిగ్గా తీసుకున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications