ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు: టిడిపి నేతల క్షీరాభిషేకం

గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఎన్టీ రామారావు విగ్రహం పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని ఎన్టీ రామారావు విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గతంలో కూడా ఎన్టీ రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటనలు తెలంగాణ ప్రాంతంలో జరిగాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణతో గతంలో అటువంటి సంఘటనలు జరిగాయి.
ప్రస్తుతం వరంగల్ జిల్లాలోని నర్సంపేట పట్టణంలో ఎన్టీ రామారావు విగ్రహానికి ఎవరు, ఎందుకు నిప్పు పెట్టారనే విషయం తెలియడం లేదు. తెలంగాణకు, సంఘటనకు మధ్య ఏమైనా సంబంధం ఉందా అనే విషయం కూడా తెలియడం లేదు.












Click it and Unblock the Notifications