పేద, మధ్యతరగతి ప్రజలకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ !!
ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు కొండంత అండగా నిలిచిన ఎన్టీఆర్ వైద్య సేవలు (ఆరోగ్యశ్రీ) సేవలు నిలిచిపోవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. నేటి నుంచి నెట్‌వర్క్ ఆసుపత్రులు సేవలను నిలిపివేయడంతో.. లక్షలాది పేద, మధ్యతరగతి ప్రజలు వైద్యం కోసం ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆసుపత్రుల యాజమాన్యాలు సమ్మె బాట పట్టడం పరిస్థితిని మరింత విషమంగా మార్చింది.
గత కొన్ని నెలలుగా పేరుకుపోయిన బకాయిలే ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని ఆసుపత్రుల సంఘాలు చెబుతున్నాయి. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.2,500 కోట్ల నుంచి రూ.3,000 కోట్లకు చేరుకున్నాయని.. చెల్లింపులపై ఎలాంటి స్పష్టమైన రోడ్‌మ్యాప్ లేకపోవడం వల్ల చిన్న, మధ్య తరహా ఆసుపత్రులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లాయని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. నిర్వహణ ఖర్చులు, సిబ్బంది జీతాలు, ఔషధాల ధరలు పెరుగుతున్న సమయంలో బిల్లులు రాకపోవడం ఆసుపత్రుల మనుగడకే ముప్పుగా మారిందని చెబుతున్నారు.

హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్యాకేజీలను సవరించకుండా కొత్త విధానాన్ని అమలు చేయడం తగదని ఆసుపత్రులు పేర్కొంటున్నాయి. వెంటనే రూ.3,000 కోట్ల బకాయిలను విడుదల చేయాలని, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ప్యాకేజీ ధరలను పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఏప్రిల్ 1 నుంచి సేవలను నిలిపివేస్తామని వారం ముందే అల్టిమేటం ఇచ్చినా, చర్చలు జరపకపోవడం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఇక మరోవైపు ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తున్న యూనివర్సల్ హెల్త్ కవరేజ్ (UHC) విధానంపై కూడా ఆసుపత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 2017 నాటి పాత ప్యాకేజీ ధరలనే ప్రామాణికంగా తీసుకుని ఇన్సూరెన్స్ మోడల్‌లో చెల్లింపులు చేస్తామనడం అన్యాయమని డాక్టర్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం పెరిగిన ఖర్చుల దృష్ట్యా పాత రేట్లతో నాణ్యమైన వైద్యం అందించడం అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు.
అత్యవసర శస్త్రచికిత్సలు, గుండె సంబంధిత చికిత్సలు, క్యాన్సర్ వంటి ప్రాణాపాయ వ్యాధులకు చికిత్సలు ఆలస్యం కావడం వల్ల రోగుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా ఈ పథకంపై ఆధారపడటంతో, వారి పరిస్థితి మరింత దయనీయంగా మారే ప్రమాదం ఉంది. ప్రభుత్వం-ఆసుపత్రుల మధ్య నెలకొన్న ఈ ప్రతిష్టంభన త్వరగా పరిష్కారం కాకపోతే, రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. తక్షణమే చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని ప్రజలు, వైద్య నిపుణులు కోరుతున్నారు. పేదల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఈ అంశంలో ప్రభుత్వం వేగంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అత్యవసరంగా కనిపిస్తోంది.
-
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications