సోషల్ మీడియాలో జెండా పాతిన జనసేన : పార్టీ థియరీ జనంలోకి తీసుకెళ్తారా!
హైదరాబాద్ : అసలు జనసేనకంటూ థియరీ ఏమైనా ఉందా అర్థం చేసుకోవడానికి? రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చినప్పుడు పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలివి. తాజాగా జనసేన తీసుకున్న ఓ నిర్ణయాన్ని పరిశీలిస్తే.. పార్టీకంటూ ఓ థియరీని సిద్దం చేసే పనిలో పవన్ కళ్యాణ్ ఉన్నారేమో అన్న అభిప్రాయం కలగకమానదు.
రెండున్నరేళ్ల కిందట పార్టీ ప్రారంభించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అప్పటి ఎన్నికల తర్వాత మొన్నీమధ్యే తిరుపతి, కాకినాడ సభలతో మళ్లీ రాజకీయ తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే.ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రి వెంకయ్యను, ఏపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ లాంటి వ్యక్తులను ముందుకొచ్చి పోరాడాలని సూచించాడు.
యూట్యూబ్ , ట్విట్టర్, ఫేస్ బుక్

ప్రస్తుతం అధికారంలో ఉన్న నేతలంతా మావల్ల కాదని చేతులెత్తేస్తే.. తానొచ్చి హోదా కోసం పోరాడుతానని ఆ సందర్బంగా స్పష్టం చేశాడు. ఇక ఆ తర్వాత కాటమరాయుడు షూటింగ్ లో బిజీ అయిపోయిన పవన్ కళ్యాణ్.. మళ్లీ పొలిటికల్ తెరమీద ఎప్పుడు కనిపిస్తారన్నది ఎవరికీ అంతుచిక్కని అంశం.
ఈ నేపథ్యంలో జనంతో ఎప్పుడూ టచ్ లో ఉండేలా సోషల్ మీడియా వేదికగా జనసేనను యాక్టివ్ చేశారు పవన్ కళ్యాణ్. నేటి నుంచి ఫేస్ బుక్, ట్విట్టర్ లలో జనసేన అధికారిక పేజీ ప్రారంభమైంది. దీని ద్వారా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించడంతో పాటు.. పార్టీకి సంబంధించిన ఓ ప్రాక్టికల్ థియరీని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇక సోషల్ మీడియాలో జనసేన యాక్టివ్ అవడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఉన్న జనసేన ఖాతాల ద్వారా పవన్ కళ్యాణ్ స్పీచులు, పార్టీ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు తెలియపరచనున్నట్టు అధికారిక ప్రకటన విడుదలైంది.












Click it and Unblock the Notifications