ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన పడవలు, కేసు పెట్టిన అధికారులు, వైసీపీ కుట్రకోణంపై డౌట్
ప్రకాశం బ్యారేజ్ గేట్లను ప్రైవేట్ పాడవలు ఢీ కొట్టిన ఘటనపై ఆంధ్ర ప్రదేశ్ ఇరిగేషన్ అధికారులు విజయవాడ వన్ టౌన్ పోలీసులు ఫిర్యాదు చేశారు. భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో మర పడవలు నదిలోకి తీసుకెళ్లకూడదు అని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే సంబంధిత అధికారుల ఆదేశాలను లెక్కచేయకుండా మర పడవలు కృష్ణా నదిలోకి వెళ్లాయని ఇరిగేషన్ అధికారులకు అంటున్నారు.
నాలుగు మర పడవలు ఈనెల 1వ తేదీన వేకువ జామున ప్రకాశం బ్యారేజ్ గేట్లను డి కోట్టాయని అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అందులో మూడు భారీ పడవలు, ఒక చిన్న పడవ వెనుక నుంచి ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీకొట్టాయని, దీంతో రెండు గేట్లకు ఉన్న కౌంటర్ వెయిట్లు దెబ్బ తిన్నాయని ఇరిగేషన్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఒకేసారి నాలుగు పడవలు ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీ కొట్టడం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగు మర పడవలు ప్రకాశం బ్యారేజ్ గేట్లను డీకొట్టడం వెనక అనేక అనుమానాలు ఉన్నాయని, విచారణ జరిపి వివరాలు ఇవ్వాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లు వెనుక నుండి ఢీకొట్టడం వెనుక వైసీపీ కుట్ర కోణం ఉందని టీడీపీ పదేపదే ఆరోపణలు చేస్తున్నారు.
ఈ సంఘటన జరిగిన ఐదు రోజులు తర్వాత ఇరిగేషన్ అధికారులు పోలీసులు ఫిర్యాదు చేయడంతో కథ రసవత్తరంగా మారింది. ప్రకాశం బ్యారేజ్ గేట్లు దెబ్బ తీయడానికి మర పడవలు నదిలో వదిలేసి ఉంటారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. టీడీపీ ఆరోపణలను కొంతమంది వైసీపీ నాయకులు ఖండించిన విషయం కూడా తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు.
శుక్రవారం ఇరిగేషన్ అధికారులు విజయవాడ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఆర్ నమోదు అయ్యింది. ప్రభుత్వ అధికారుల ఫిర్యాదులు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీస్ అధికారులు తెలిపారు. భారీ వర్షాలు వరదల కారణంగా విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో జలమయం అయ్యాయి. విజయవాడను సాదారణ పరిస్థితికి తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది.












Click it and Unblock the Notifications