స్వర్ణముఖిలో పురాతన వస్తువులు, వరంగల్లో బయటపడిన విగ్రహాలు
హైదరాబాద్: చిత్తూరు జిల్లా తిరుపతి దగ్గరలోని రేణిగుంట సమీపంలో స్వర్ణముఖి నదిలో పురాతన కాలపు వస్తువులు బయటపడ్డాయి. వీటిలో పూర్వ కాలపు కుండలు, చెక్క బల్లలు ఉన్నాయి. వీటిని పరిశీలించి కాల నిర్ణయం చేయడానికి పురావస్తుశాఖ అధికారులు రానున్నారు.
చెరువు పనుల్లో బయటపడిన విగ్రహాలు
మిషన్ కాకతీయలో భాగంగా వరంగల్ జిల్లా రేగొండ మండలం నిజాంపల్లి గ్రామంలో రెడ్డి చెరువు పునరుద్ధరణ పనుల్లో శనివారం నాడు నాలుగు విగ్రహాలు బయటపడ్డాయి. చెరువులో పూడిక పనులను గుత్తేదారు నెల రోజుల క్రితం ప్రారంభించారు.

శనివారం చెరువు పాత తూము వద్ద జేసీబీతో తవ్వకాలు చేపట్టారు. ఐదు అడుగుల లోతు తవ్వగానే నాలుగు విగ్రహాలు, నాలుగు స్తంభాలు కనిపించాయి. వాటిని బయటకు తీశారు. మూడు ద్వారపాలకుల విగ్రహాలు, మరొకటి విష్ణుమూర్తి విగ్రహం. గ్రామస్థులు వచ్చి పూజలు చేశారు. ప్రస్తుతం చెరువు పనులు నిలిపేశారు.












Click it and Unblock the Notifications