జగన్ కాన్వాయ్‌లో వాహనం ఢీకొని వ్యక్తి మృతి.. పట్టించుకోకుండా వెళ్లిన మాజీ సీఎం !
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పల్నాడు జిల్లాలో పర్యటన చేస్తుండగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జగన్ కాన్వాయ్‌లోని వాహనం ఓ వృద్ధుడిని ఢీకొట్టిన ఘటన కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా ఏటుకూరు సమీపంలోని లాల్‌పురం హైవేపై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
పట్టించుకోకుండా వెళ్లిన జగన్..
జగన్ పర్యటనలో భాగంగా వైసీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహిస్తుండగా.. నేతల వాహనాల్లో ఒకటి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధుడిని ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన బాధితుడిని వైసీపీ కార్యకర్తలు రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయినట్లు ఆరోపిస్తున్నారు. అనంతరం స్పందించిన స్థానికులు ఆయన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర రక్తస్రావం కారణంగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు.

మరోవైపు జగన్ ఈరోజు సత్తెనపల్లిలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఓ వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. అదే సందర్భంలో అతని విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఈ పరిస్థితుల్లో ప్రమాదం జరిగి వ్యక్తి మృతి చెందడం ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తుంది.
ఈ ప్రమాద ఘటనపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ శవ రాజకీయాలు చేస్తున్నాడని టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. పరామర్శల పేరుతో సామాన్యుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఎక్స్ వేదికగా మండిపడింది. ఒక మనిషి తీవ్రగాయాలపాలైతే జగన్ కనీసం పట్టించుకోకుండా వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
జగన్ రెడ్డి ప్రచార పిచ్చకి మరొకరు బలయ్యారు. సత్తెనపల్లి వెళ్తూ, ఏటుకూరు బైపాస్ దగ్గర రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తిని జగన్ కాన్వాయ్ ఢీ కొట్టింది. కనీస మానవత్వం లేకుండా, గాయపడిన వ్యక్తిని పట్టించుకోకుండా జగన్ వెళ్లిపోగా, స్పందించిన పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రిలో చేర్పించారు.… pic.twitter.com/EBqQ8IQmkh
— Telugu Desam Party (@JaiTDP) June 18, 2025












Click it and Unblock the Notifications