విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరో కొత్త మెసెంజర్‌ యాప్! సృష్టికర్త ఓ పదో తరగతి విద్యార్థి.. మనవాడే!!

విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఆదుర్తి సూర్యచంద్ర పవన్ తనలోని సాంకేతిక ప్రతిభకు పదునుబెట్టి వాట్సాప్ లాంటి ఒక మెసెంజర్ యాప్ ను అభివృద్ధి చేశాడు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఓ కుర్రాడు తనలోని సాంకేతిక ప్రతిభకు పదునుబెట్టి ఒక మెసెంజర్ యాప్ ను అభివృద్ధి చేశాడు. అతడు పదో తరగతి చదువుతున్న విద్యార్థి కావడం.. అందునా మనవాడు అయివుండటం విశేషం.

వివరాల్లోకి వెళ్తే... విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఆదుర్తి సూర్యచంద్ర పవన్ కు టెక్నాలజీపై ఆసక్తి ఎక్కువ. ఆరో తరగతి నుంచే ఇంటర్నెట్ ద్వారా వివిధ ప్రోగ్రాంలను ఎలాంటి శిక్షణ లేకుండానే నేర్చుకునేవాడు.

అదే ఆసక్తితో వాట్సాప్ లాంటి మొబైల్ యాప్ ను రూపొందించాడు. దానికి 'పవన్ మెసెంజర్' అని పేరు పెట్టాడు. గూగుల్ ప్లేస్టోర్ లో దీనిని అప్ లోడ్ చేయాలంటే ముందుగా డెవలపర్ కన్సల్టెన్సీ అనుమతి తీసుకోవాల్సిందే.

One More Messenger App! Inventor is a 10th Student!!

అందుకు అవసరమైన అన్ని వివరాలతో రిజిస్టర్ చేసుకుని ప్లేస్టోర్ లోకి అప్ లోడ్ చేశాడు. టెలిగ్రామ్ ఆర్గనైజేషన్ అంతర్జాలంలో ఉంచిన నెట్ సర్వీసుతో ఈ 'పవన్ మెసెంజర్'పని చేస్తుంది.

ఈ మెసెంజర్ యాప్ లో గ్రూప్ చాటింగ్, ఛానల్ క్రియేషన్, కాలింగ్ సదుపాయం, చాట్ బ్యాక్ గ్రౌండ్ ఛేంజ్, వీడియో కంప్రెస్, ఫాస్ట్ ఫైల్ ట్రాన్స్ ఫర్, స్టిక్కర్స్ తదితర సదుపాయాలు ఉన్నాయి. సామాన్యులకు కూడా సులువుగా అర్థమయ్యేలా ఉన్న ఈ 'పవన్ మెసెంజర్'ను
గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

English summary
A 10th class student who is studying in a private school at Visakhapatnam invented a messenger app which works like WhatsApp. The name of the app is 'Pavan Messenger'. It's free, you can download it from google play store.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X