నెంబర్ ఒన్ స్థానంలో ఏపీ - కేంద్రమే తేల్చింది: సీఎం జగన్ మార్క్- వరసగా మూడోసారి..!!
ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించి 40 నెలలు పూర్తయింది. ఇప్పటి వరకు జగన్ పూర్తిగా సంక్షేమం పైనే ఫోకస్ చేసారని..పెట్టబుడులు ఏపీకి లేవనే రాజకీయ విమర్శలు ఉన్నాయి. కానీ, కేంద్రం
మాత్రం ఏపీకి ఫస్ట్ ర్యాంకు ఇచ్చింది. ఒక సారి కాదు. మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ తొలి స్థానంలో నిలిచింది. పరిశ్రమల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఏపీ నిలుస్తోంది. సంక్షేమంలో ఇప్పటికే అనేక రికార్డులను సాధించిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం.. మరో వైపు పారిశ్రామిక వృద్ధిలోనూ దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలుస్తోంది.

కేంద్ర గణాంకాల సాక్ష్యంగా
దీనికి సంబంధించి కేంద్రం ఏ రకంగా ఈ ర్యాంకింగ్స్ ఇస్తుందో సీఎం స్వయంగా వివరించారు. మొదటి సారిగా పరిశ్రమలు పెట్టిన వారి నుంచి ఏపీ లో పరిస్థితులపై ఆరా తీసి..వారి అభిప్రాయాలకు మార్కులు కేటాయిచంటం తో ఏపీకి నెంబర్ ఒన్ ర్యాంకు సాధ్యమైందని సీఎం చెప్పారు. ఏపీలోని పారిశ్రామిక వేత్తలు ఏపీ ప్రభుత్వ మద్దతుగా నిలుస్తోంది. ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. రాయితీలు - ప్రోత్సాహకాల ద్వారా వారి సామర్ధ్యం పెంచేందుకు సహకరిస్తోంది. 2021-22 లో దేశంలోనే అత్యధిక గ్రోత్ 11.43 రేట్ తో ఏపీ నెంబర్ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల వాతావరంణ..అందిస్తున్న మద్దతుతో వరుసగా మూడేళ్లుగా ఏపీ ఈ ర్యాంకు నిలబెట్టుకుంది. ప్రస్తుతం రామాయపట్నంలో పోర్టు నిర్మాణం కోసం కార్యాచరణ సిద్దం అవుతోంది. రాష్ట్రంలో మరో నాలుగు ప్రాంతాల్లో కొత్త పోర్టుల నిర్మాణానికి నిర్ణయించారు. భావనపాడు..రామాయపట్నం, కాకినాడ, మచిలీపట్నం లో అందుబాటులోకి రానున్నాయి. మరో నాలుగు పోర్టులు కొత్తగా అడుగులు వేస్తున్నారు. తొమ్మది ఫిషింగ్ హార్బర్ లు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు.

పోర్టులు - షిప్పింగ్ హార్బర్ లు
ప్రతీ 50 కిలో మీటర్లకు హర్బర్ ఉండేలా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఏపీ నుంచి ప్రస్తుతం లక్ష 70 వేల కోట్ల మేర ఎగుమతులు కొనసాగుతున్నాయి. రానున్న అయిదేళ్ల కాలంలో ఈ మొత్తం విలువ 3లక్షల 40 వేల కోట్లకు ఎగుమతులు పెరిగేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా యూడు పారిశ్రామిక కారిడార్లు ఏపీలో రానున్నాయి. విశాఖ టు చెన్నై, చెన్నై టు బెంగళూరు, హైదారబాద్ టు బెంగళూరు అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటుగా.. కొప్పర్తిలో మెగా ఇండస్ట్రియల్ హబ్.. కడపలో - తిరుపతిలో పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటవుతున్నాయి. ఇవి పూర్తయితే పెద్ద సంఖ్యలో యువతకు ఉపాధి అందనుంది. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2022లో మొదటి ఏడు నెలల్లో దేశ వ్యాప్తంగా రూ.1,71,285 కోట్ల పెట్టుబడులు వస్తే.. ఒక్క ఏపీలోనే రూ.40,361 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దేశంలో రెండంకెల వృద్ధి రేటుతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ నిలిచింది.

గ్రోత్ రేటు రెట్టింపు చేయటమే లక్ష్యంగా
2021-22లో దేశ జీడీపీ వృద్ధిరేటు 8.7 శాతం కాగా.. అదే సమయంలో ఏపీ వృద్ధిరేటు ఏకంగా 11.43 శాతం కేంద్ర గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్.. డీపీఐఐటీ రూపొందించిన నివేదిక ఏపీ సత్తా దేశం మొత్తానికి తెలిసింది. ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో దేశం మొత్తం మీద గత ఏడు నెలల్లో వచ్చిన పెట్టుబడుల్లో 45 శాతం వరకు పెట్టుబడులు ఏపీ, ఒడిశా రాష్ట్రాలే దక్కించుకున్నాయి. ఏపీలో 123,000 కి.మీ రహదారులు, 2,600 కి.మీ రైలు నెట్‌వర్క్ ఉండడం, 24 గంటలపాటు విద్యుత్ సరఫరా పెట్టుబడులకు కలిసొచ్చే అంశం. రాష్ట్రంలో 974 కి.మీ. మేర దేశంలో రెండో పొడవైన తీర ప్రాంతం ఉండడం, రైలు, రోడ్డు రవాణా సదుపాయాలు పుష్కలంగా ఉండడం పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయని ఇన్వెస్ట్ ఇండియా వెల్లడించింది. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పరిశ్రమల ఫెండ్లీ విధానం తో మరింతగా ఏపీ వైపు ఆసక్తి పెంచుతోంది. ఇలా..అటు సంక్షేమంతో పాటుగా పారిశ్రామిక వృద్ధిలోనూ దేశంలోనే నెంబర్‌వన్‌గా ఏపీ సీఎం జగన్ పాలనలో ముందుకు వెళ్తోంది.
-
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు!












Click it and Unblock the Notifications