జగనన్నకు చెబుదాంపై టీడీపీ, బీజేపీ రియాక్షన్స్ ఇవే...
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రజల నుంచి వచ్చే ప్రతీ ఫిర్యాదు పరిష్కారం కోసమంటూ జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించింది. సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ రాష్ట్రంలో సమస్యలు అన్నవి లేకుండా ఫిర్యాదుల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. నేరుగా మీ అన్నకు, మీ సీఎంకే సమస్యలు విన్నవించే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దీనిపై విపక్షాలు స్పందించాయి.
సీఎం జగన్ ఇవాళ ప్రారంభించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ట్విట్టర్లో స్పందించారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రారంభిస్తున్న "జగనన్నకు చెబుదాం" కార్యక్రమంకు ఇప్పటికే జిల్లాల్లో జరుగుతున్న స్పందన కార్యక్రమం కు మధ్య వ్యత్యాసం ఏమైనా ఉందా..? గడిచిన నాలుగు సంవత్సరాలుగా 'స్పందన'కు కాళ్లు అరిగేలా తిరిగినా ప్రయోజనం ఏమైనా వుందా? అని గంటా ప్రశ్నించారు.

రాష్ట్రంలో గడిచిన 4 సంవత్సరాలుగా అన్ని వర్గాల ప్రజలు చిన్నాభిన్నమైపోయారని, మన రాష్ట్రంలో ఇప్పుడు సమస్యలు లేనివారు ఎవరు..? తమ పొలాలు రాజధానికి ఇచ్చి దగా పడ్డ అమరావతి రైతుల సమస్యలు పరిష్కరిస్తారా..? జీతం ఎప్పుడు పడుతుందో అని ఎదురు చూపులు చూస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారా..?, కరువులతో అల్లాడుతూ ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్న పేద రైతుల సమస్యలు పరిష్కరిస్తారా..? పెన్షన్ ఎప్పుడు పడుతుందో అని ఎదురు చూస్తున్న రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారా..? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారా..? అని గంటా ట్వీట్ లో ప్రశ్నించారు.
మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే CPS రద్దు చేస్తారని మీకు ఓటు వేసి.. మోసపోయిన ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారా..?, గడిచిన 4 సంవత్సరాల నుంచి జీతాలు సరిగ్గా పడక, జీతాలు పెంచక ఇబ్బందులు పడుతున్న కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారా..?, అధికారంలోకి వచ్చిన వెంటనే సంపూర్ణ మద్యపాన నీషేదం అని చెప్పిన మీరు , ఇప్పుడు దాన్నే ఆదాయ వనరుగా మార్చి, మీరు తెచ్చిన కొత్త నాసిరకం బ్రాండ్లు తాగి ప్రాణాలు కోల్పోయి బజారున పడ్డ వారి కుటుంబ సభ్యుల సమస్యలు పరిష్కరిస్తారా..? మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పోగొట్టుకున్న అవ్వ, తాతల సమస్యలు పరిష్కరిస్తారా..?, మీరు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒక DSC నోటిఫికేషన్ కానీ.. ఒక APPSC నోటిఫికేషన్ లేక ఆశ తో ఎదురు చూపులు చూస్తున్నా నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారా..? అని గంటా సూటి ప్రశ్నలు వేశారు.

ఇదే తరహాలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కూడా జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై సెటైర్లు వేశారు. వైసీపీ సర్కారు 'జగనన్నకు చెబుదాం' అనే కార్యక్రమాన్ని తీసుకురావడంపై సత్యకుమార్ విమర్శనాస్త్రాలు సంధించారు. జగనన్నకు చెప్పుకోవడం, చెవిటి వాడి ముందు శంఖం ఊదడం రెండూ ఒకటేనని అన్నారు. జగనన్నకు చెబుదాం టోల్ ఫ్రీ నెంబర్ డయల్ చేస్తే, జగనన్న చెప్పే అబద్ధాలు మెసేజ్ ల రూపంలో వస్తాయని సత్యకుమార్ తెలిపారు. కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేయడం తప్ప, సమస్యల పరిష్కారం ఉత్తిమాటేన్నారు. జగనన్నే అసలు సమస్య అయినప్పుడు, ఇక జగనన్నకు చెబుదాం అనేది అర్థరహితమన్నారు.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
ఏపీలోని ఆ గ్రామంలో పిడకల సమరం.. చూస్తే మీరే షాక్ అవుతారు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications