సాయం చేస్తాం: చంద్రబాబు, నీళ్లు తగ్గించండి: జయ.. వరదలో చెన్నై (పిక్చర్స్)
చిత్తూరు/చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలో సాయం అందించేందుకు పక్క రాష్ట్రాలు ముందుకు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదుకునేందుకు సిద్ధమని చెప్పారు.
తమిళనాడు పరిస్థితుల నేపథ్యంలో.. తమిళనాడు ముఖ్యమంత్రికి ఫోన్ చేయాలని, ఏమైనా సాయం కావాలో అడగాలని చంద్రబాబు ఏపీ ప్రభుత్వ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావును ఆదేశించారు. ఆయన తమిళనాడు సీఎస్‌కు ఫోన్ చేసి ఆరా తీశారు. సాయం చేస్తామని చెప్పారు.
దీంతో, చిత్తూరు జిల్లాలోని కొన్ని డ్యాంల నుంచి నీటి విడుదల తగ్గించాలని తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు. దానికి ఏపీ సీఎస్ సానుకూలంగా స్పందించారు. మరోవైపు, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల స్పందనకు తమిళనాడు సీఎస్ కృతజ్ఞతలు తెలిపారు.

చెన్నై వరదలు
చెన్నైని వర్షం వదిలేలా లేదు. మరో రెండు రోజుల పాటు వర్షాలు వచ్చే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, రోజుకు ఇరవై వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

చెన్నై వరదలు
చెన్నై వరదల నేపథ్యంలో సాయం కోసం 'ఐఎన్ఎస్ ఐరావత్' తరలింది. వేలాది మంది సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

చెన్నై వరదలు
తమిళనాడు ప్రభుత్వం, కేంద్ర బలగాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. కేంద్రం ఎప్పటికప్పుడు పరిస్థితిపై ఆరా తీస్తోంది.

చెన్నై వరదలు
తమిళనాడులో గత మూడు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు చెన్నై నగరం అతలాకుతలమవుతోంది. నగరంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.

చెన్నై వరదలు
విమానాశ్రయం, రహదారులు, రైలు పట్టాలు జలమయం కావడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న ఈ వర్షాలకు నగరంలో లోతట్టు ప్రాంతాలు, కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.

చెన్నై వరదలు
ముంపునకు గురైన ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్, నేవీ, సైనిక దళాలు రంగంలోకి దిగి సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. నవంబర్ మూడోవారంలో కురిసిన వర్షాల నుంచి తేరుకోకముందే తాజా వర్షాలు ప్రజలను మరింత ముంచేశాయి.












Click it and Unblock the Notifications