ఆందోళన కలిగిస్తున్న ఆత్మహత్యలు?: ఏఎస్పీ శశికుమార్ మృతిపై వీడని మిస్టరీ

Subscribe to Oneindia Telugu

విశాఖపట్నం: పోలీసు విభాగంలో చోటు చేసుకుంటున్న ఆత్మహత్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతున్నాయి. ఇటీవల కాలంలో ఈ విభాగంలో ఆత్మహత్యలు ఎక్కువ కావడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.

ఏఎస్పీ అనుమానాస్పద మృతి: మిన్నంటిన రోదనలు, సూసైడ్ లేఖలో ఏముంది?(పిక్చర్స్)

గతంలో సంచలనం రేపిన పాడేరు ఏఎస్పీ శశికుమార్‌ ఆత్మహత్య ఘటన జరిగి జూన్ 16వ తేదీకి సరిగ్గా ఏడాది పూర్తి కావస్తోంది. అయితే, అతని ఆత్మహత్య మిస్టరీ మాత్రం ఇప్పటికీ వీడకపోవడం గమనార్హం.

ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి చివరి మాటలివే: శిరీష, ప్రభాకర్‌ల మృతిపై ఎన్నో అనుమానాలు

విధి నిర్వహణలోనే..

విధి నిర్వహణలోనే..

తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఏఎస్పీ శశికుమార్‌ విధి నిర్వహణలో ఉంటూ గత సంవత్సరం జూన్‌ 16న క్యాంపు కార్యాలయంలో తన రివాల్వర్‌తో తలపై కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొనవూపిరిలో ఉన్న ఆయనను వెంటనే పాడేరు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఆస్పత్రికి తరలించిన కొద్దిసేపటికే ఆయన తుది శ్వాస విడిచారు.

విధుల్లో నిబద్ధత, ఉత్సాహం

విధుల్లో నిబద్ధత, ఉత్సాహం

విధుల్లో ఎంతో నిబద్ధతగా, ఉత్సాహంగా ఉండే ఈ యువ ఐపీఎస్‌ అధికారి విధుల్లో ఉంటూ ఊహించనివిధంగా ఆత్మహత్యకు పాల్పడటం అప్పట్లో సంచలనంగా మారింది. అతని మృతదేహం వద్ద సూసైడ్‌ నోట్‌ లభ్యం కావడం అప్పట్లో కలకలం సృష్టించింది.

విచారణ కొనసా..గుతూనే వుంది

విచారణ కొనసా..గుతూనే వుంది

ఘటనపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీతో విచారణకు ఆదేశించింది. జిల్లా సీబీసీఐడీ జిల్లా నాయుడు ఆధ్వర్యంలో విచారణ అధికారిని నియమించింది.
శశికుమార్‌ ఆత్మహత్యకు సంబంధించి సీఐడీ బృందం విచారణ చేపట్టి 12 నెలల గడుస్తున్నా విచారణ తుది దశకు చేరలేదని తెలుస్తోంది.

ఎవరూ బాధ్యులు కారని సూసైడ్ నోట్

ఎవరూ బాధ్యులు కారని సూసైడ్ నోట్

అప్పట్లో ఈ ఘటనకు సంబంధించి ఘటన జరిగిన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న సీఐడీ బృందం పాడేరు చేరుకొని పలు మార్లు విచారణ చేపట్టింది. బంగ్లాను క్షుణంగా పరిశీలించిన బృందం.. ఇక్కడ పనిచేసే పనివారితో పాటు రక్షణగా ఉండే సీఆర్‌పీఎఫ్‌ భద్రత సిబ్బందిని వ్యక్తిగతంగా విచారించింది. ఘటనా స్థలం వద్ద లభ్యమైన బుల్లెట్లను, డైరీ, సూసైడ్‌ నోట్‌ను పరిశీలించింది. తన సూసైడ్ నోట్‌లో తన మరణానికి ఎవరూ కారణం కాదని ఏఎస్పీ శశికుమార్ పేర్కొన్నట్లు తెలిసింది.

కన్నీరుమున్నీరైన కుటుంసభ్యులు

కన్నీరుమున్నీరైన కుటుంసభ్యులు

శశికుమార్‌ స్వగ్రామంలో పర్యటించి ఆయన చదువుకున్న రోజుల్లో సహచర్లతో ఎలా విధంగా ఉండేవారు, కుటుంబ సభ్యులతో ఏ రకంగా మెలిగేవారు అన్న విషయాలనను కూడా దర్యాప్తు బృదం సేకరించింది. దీంతో పాటు ఏఎస్పీ కుటుంబీకులు సైతం పాడేరు ఏఎస్పీ బంగ్లాను సందర్శించి వాస్తవ పరిస్థితులను వీడియో చిత్రీకరణ ద్వారా సేకరించారు. శశికుమార్ మృతదేహాన్ని చేసిన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

అధికారి సస్పెన్షన్‌తో మరింత ఆలస్యం

అధికారి సస్పెన్షన్‌తో మరింత ఆలస్యం

అయితే, ఈ కేసు విచారణ జరుగుతుండగానే అనుకోని పరిస్థితుల్లో ఈ కేసును విచారణ చేపడుతున్న సీఐడీ డీఎస్పీ వేర్వేరు కారణాలతో సస్పెన్షన్‌కు గురికావడంతో విచారణ మందకొడిగా సాగింది. తదుపరి ఈ కేసును మరో అధికారికి అప్పగించారు. ఈ కేసుపై ఆయన అవగాహన పెంచుకొని విచారణ చేపట్డడంతో విచారణలో మరికొంత జాప్యం ఏర్పడింది.

మంచి అధికారిని కోల్పోయాం

మంచి అధికారిని కోల్పోయాం

మరో వైపు విధి నిర్వహణలో మరణం పొందిన ఏఎస్పీ శశికుమార్‌కు గుర్తుగా పాడేరులో ఉన్న పోలీసుశాఖ అతిథి గృహానికి ఆయన పేరును పెట్టారు. తమతోపాటు ఎంతో ఉత్సాహంగా ఉండే ఉన్నతాధికారి ఇలా ఆకస్మకంగా మరణించడం తమకెంతో బాధ కలిగించిందని, మంచి అధికారిని కోల్పోయామని శశికుమార్‌తో పని చేసిన ఇతర అధికారులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Paderu ASP sasikumar suspicious death mystery not revealed yet.
Please Wait while comments are loading...