తిరుమలలో వైభవంగా ఆరంభమైన ఉత్సవాలు: ప్రత్యేకత ఇదే
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల తాకిడి నెలకొంది. వేలాదిమంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటోన్నారు. తమ మొక్కులను చెల్లించుకుంటోన్నారు. గురువారం నాడు 76,369 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 41,927 మంది తలనీలాలను సమర్పించారు.
హుండీ ద్వారా 3.63 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. సర్వదర్శనం టోకెన్లు ఉన్న వారికి స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోవడంతో పాటు సీతా తోరణం వరకు క్యూ లైన్ ఏర్పడింది. క్యూ లైన్‌లో ఉన్న వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు. అల్పాహారం, పాలు, మంచినీటి వసతిని కల్పించారు.

తిరుమలలో శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు అంగరంగ వైభవంగా ఆరంభం అయ్యాయి. ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగనున్నాయి. నారాయణగిరి ఉద్యానవనాల్లో ఏర్పాటు చేసిన పెళ్లి మండపంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా ఈ పరిణయోత్సవాలు ప్రారంభం అయ్యాయి.
మొదటిరోజున శ్రీమలయప్ప స్వామివారు, ఉభయనాంచారులు ఊరేగింపుగా పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. మలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించగా ఉభయనాంచారులను పల్లకీపై ఊరేగింపుగా మండపానికి తీసుకొచ్చారు. పెళ్లి మండపంలో ఎదుర్కోలు, పూలదండలు మార్చుకోవటం, పూలబంతులాట, నూతన వస్త్ర సమర్పణ కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. అనంతరం ఆస్థానాన్ని నిర్వహించారు అర్చకులు.
ఈ క్రతువుల పూర్తయిన తరువాత చతుర్వేద పారాయణం, మలహారి, దేశిక, సౌరాష్ట్ర, వారహి, కదన కుతూహల, నీలంబారి రాగాలు, వివిధ తాళాల వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆర్జిత భక్తులకు వస్త్రాలను బహూకరించారు.
ప్రతి వైశాఖ శుద్ధ దశమికి ముందు తిరుమలలో ఒక రోజు, తరువాత ఒక రోజు కలిపి మొత్తం మూడు రోజుల పాటు పద్మావతీ పరిణయోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 1992వ సంవత్సరం నుంచి ఈ ఉత్సవం జరుగుతోంది. పురాణాల్లో ఉన్న నారాయణవనానికి ప్రతీకగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలోనే శ్రీ పద్మావతీ శ్రీనివాసుల పరిణయోత్సవాలను నిర్వహిస్తారు.
ఈ ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని మూడు రోజులు ఆర్జిత సేవలు టీటీడీ అధికారులు రద్దు చేసిన విషయం తెలిసిందే. 19వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దయ్యాయి. 20వ తేదీన ఆ సేవలను పునరుద్ధరిస్తారు.
-
రేపే తిరుచానూర్ ఆలయంలో.. !! -
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!!












Click it and Unblock the Notifications