మద్యానికి బలి: భార్యను, కొడుకుని చంపి ఆత్మహత్య

మహారాష్ట్రలోని రాజతప్త గ్రామానికి చెందిన పెయింటర్ శరత్ (30), భార్య పద్మిని (25), కుమారుడు జయంత్ (2)తో కలిసి రెండు నెలలుగా ఓల్డ్‌హఫీజ్‌పేటలోని సాయినగర్‌లో ఉంటున్నాడు. సంపాదించిన డబ్బంతా మద్యం తాగడానికి ఖర్చు చేస్తుండడంతో భార్య అభ్యంతరం చెప్పింది.
ఈనెల 14వ తేదీ రాత్రి తాగొచ్చిన భర్తను పద్మిని నిలదీసింది. మద్యం మత్తులో ఉన్న శరత్ భార్యతో ఘర్షణ పడ్డాడు. ఆగ్రహంతో భార్య, కుమారుడిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అనంతరం తనపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రగాయాలైన ముగ్గురిని స్థానికుల సమాచారంతో పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ 15వ తేదీ మధ్యాహ్నం జయంత్, అదే రోజు రాత్రి శరత్, తెల్లవారుజామున పద్మిని మృతిచెందారు. మియాపూర్ సీఐ పురుషోత్తం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications