వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నెలాఖరులోగా కిరణ్ స్థానంలో సీమాంధ్ర నేత: పాల్వాయి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Palvai says Kiran will be replaced by month end
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఈ నెలాఖరులోగా ఆ పదవి నుండి తొలగిస్తారని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గురువారం వ్యాఖ్యానించారు. కిరణ్ స్థానంలో అధిష్టానానికి అనుగుణంగా నడుచుకునే మరో సీమాంధ్ర నాయకుడిని ముఖ్యమంత్రిగా చేస్తారని ఆయన అన్నారు. కిరణ్ నెలాఖరులోగా ఇంటికి వెళ్లడం తప్పదన్నారు.

రాష్ట్ర విభజనపై కేంద్రం పూటకో మాట మాట్లాడుతోందని తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ వేరుగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై మంత్రుల బృందం నివేదిక ఇవ్వటానికి నిర్ణీత కాల పరిమితి విధించకపోవటాన్ని తప్పుపట్టారు. ఆయన గురువారం ఇక్కడ తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణతో కలిసి మీడియాతో మాట్లాడారు.

కేంద్ర కేబినెట్ ముందుగా నిర్ణయించిన ప్రకారం ఆరు వారాల్లోనే జీవోఎం నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో తాత్సారం చేస్తే తలెత్తే ఇబ్బందులకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాటలు తెలంగాణ ప్రజల గుండెలను రగిలిస్తున్నాయన్నారు.

తాను సిఎంగా ఉండగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడదని చెబుతున్న సిఎం, మరోవైపు దీపం ఉండగానే ఇల్లు సర్దుకునే క్రమంలో కొన్ని వందల జివోలను విడుదల చేస్తున్నారని, వాటన్నింటిపైనా తెలంగాణ రాష్ట్రం వచ్చాక సమీక్ష ఉంటుందని తెలిపారు. తెలంగాణపై కక్ష కట్టినట్టు వ్యవహరిస్తున్న కిరణ్ కేబినెట్‌లో తెలంగాణ మంత్రులు ఎలా కొనసాగుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణపై కేంద్రం వెనుకడుగు వేస్తే సీమాంధ్ర ఉద్యమం కంటే పదిరెట్లు ఎక్కువగా తెలంగాణ ఉద్యమం ఉంటుందని హెచ్చరించారు.

English summary
Congress Party senior leader Pavai Goverdhan Reddy on Thursday said Kiran Kumar Reddy will be replaced by month end by a loyal leader from Seemandhra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X