ఇద్దరు బాలికలపై అత్యాచారం:పానీపూరి వ్యాపారి దారుణం...కేసు నమోదు

Posted By:
Subscribe to Oneindia Telugu

గుంటూరు: రోజూ తనవద్దకు పానీ పూరి కోసం వచ్చే ఇద్దరు బాలికలపై ఆ వ్యాపారి కన్ను పడింది. అలాగే అమాయకంగా మరో సారి తన వద్దకు పానీపూరి తినేందుకు వచ్చని ఆ ఇద్దరు చిన్నారులకు మాయమాటలు చెప్పి పక్కకు తీసుకెళ్లాడు.

ఆ తరువాత అభం శుభం తెలియని ఆ బాలికలపై లైంగికదాడి చేయడంతో పాటు అత్యాచారం చేశారు. మైనర్లయిన ఆ బాలికలు ఇంట్లో విషయం చెప్పేందుకు భయపడటంతో ఘటన జరిగిన వెంటనే వెలుగులోకి రాలేదు.ఇద్దరు చిన్నారుల్లో అస్వస్థతకు గురైన ఒక బాలిక శనివారం తన తల్లికి విషయం చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.

Pani puri vendor raped 2 minor girls in Guntur district

వివరాల్లోకి వెళితే...తెనాలి పాండురంగపేటకు చెందిన గండికోట నరసింహం పానీపూరీ వ్యాపారం చేస్తుంటాడు. ఇతడి వద్దకు పానీపూరి తినడం కోసమని అదే పాండురంగపేటకు చెందిన ఇద్దరు మైనర్‌ బాలికలు రోజూ వస్తుండేవారు. ఈ క్రమంలో వారిపై కన్నేసిన గండికోట నరసింహం వారికి మాయమాటలు చెబుతూ
ఈ నెల 10వ తేదీ రాత్రి సమీపంలోని రైల్వే ట్రాక్‌ ప్రక్కనే ఉన్న నిర్జన ప్రదేశంలోకి తీసుకువెళ్లి మొదటవారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఇంటికి తిరిగివెళ్లిన ఆ బాలికలు జరిగిన విషయానికి భయపడి ఇంట్లో చెప్పలేదు.

అయితే వీరిలో ఓ బాలిక అస్వస్థతకు గురైన మీదట తల్లి ప్రశ్నించడంతో జరిగిన విషయాన్ని ఆ చిన్నారి తన తల్లికి తెలియచెప్పింది. దీంతో ఆమె ఆదివారం పానీపూరి వ్యాపారి గండికోట నరసింహంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమార్తె, మరో బాలికపై నరసింహం అత్యాచారానికి పాల్పడ్డాడని, బాలిక ఎస్సీ కావటం కూడా వేధింపులు జరగడానికి కారణమని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు నిందితునిపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసులు నమోదు చేశారు.

ఈ కేసు విషయాన్ని సీరియస్ గా తీసుకొని తెనాలి డీఎస్పీ స్నేహిత స్వయంగా దర్యాప్తు చేపట్టారు. లైంగిక దాడికి గురైన ఇద్దరు మైనర్ బాలికలను తెనాలి జిల్లా వైద్యశాలకు చికిత్స కోసం పంపినట్లు తెలిపారు. ఆదివారం రాత్రి ఆ బాలికల కుటుంబ సభ్యులను కలెక్టర్‌ కోన శశిధర్‌, రూరల్‌ ఎస్పీ అప్పలనాయుడు, ఆర్డీఓ నరసింహులు తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి పరామర్శించడం గమనార్హం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Guntur: A Panipuri vendor who had raped two minor girls who have come to eat panipuri. A girl's mother complained to the police that these girls have taken to a deserted place and raped by the victim.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి