టీడీపీ ఆశలపై "స్వామిజీ" నీళ్లు - మారుతున్న లెక్కలు..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తిగా మారుతోంది. పొత్తులో భాగంగా బీజేపీ పోటీ చేసే స్థానాల పైన క్లారిటీ వచ్చింది. అభ్యర్దులను ఆ పార్టీ ప్రకటించింది. టీడీపీకి పట్టున్న నియోజకవర్గాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. దీని పైన టీడీపీ సీనియర్లు ఆగ్రహంగా ఉన్నారు. రాయలసీమలో ఉమ్మడి అనంత జిల్లాలో తిరిగి సత్తా చాటాలని టీడీపీ భావిస్తోంది. అయితే, కీలకమైన నియోజకవర్గంలో ఇప్పుడు స్వామీజీ నిర్ణయంతో టీడీపీలో ఆందోళన మొదలైంది.
హోరా హోరీ పోరు
ఏపీలో ఎన్డీఏ కూటమిగా మూడు పార్టీలు పోటీ చేసే స్థానాలు ఖరారయ్యాయి. పొత్తులో బీజేపీకి 6 ఎంపీ, 10 ఎమ్మెల్యే స్థానాల నుంచి అభ్యర్దులు బరిలో నిలవనున్నారు. హిందూపురం పార్లమెంట్ స్థానం పైన కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద ఆశలు పెట్టుకున్నారు., అయితే, పొత్తు చర్చల్లో బీజేపీ హిందూపురం స్థానం దక్కలేదు. ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న పరిపూర్ణానంద తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని కలిసారు. తన నిర్ణయం ఏంటో స్పష్టం చేసారు. తాను హిందూపురం పార్లమెంట్ తో పాటుగా హిందూపురం అసెంబ్లీ బరిలోనూ నిలుస్తానని తేల్చి చెప్పారు. దీంతో, ఇప్పుడు టీడీపీ అనంత నేతల్లో టెన్షన్ మొదలైంది.

బరిలో స్వామీజీ
బీజేపీలో స్వామి పరిపూర్ణానంద కొంత కాలంగా యాక్టివ్ గా ఉన్నారు. హిందుత్వ అజెండాతో మత వ్యాప్తి దిశగా స్వామి పరిపూర్ణానంద అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దు కావటం..దక్షిణాది రాష్ట్రాలు, భాషల్లో పట్టుుండటం ఆయనకు కలిసొచ్చే అంశం. స్వామి పరిపూర్ణానంద స్వంత్రంగా పోటీ చేయటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతోంది. హిందూపురం ఎంపీగా టీడీపీ బీసీ నేత పార్ధసారధిని ప్రకటించింది. హిందూపురం అసెంబ్లీ నుంచి వరుసగా మూడో సారి నందమూరి బాలయ్య పోటీ చేస్తున్నారు. బాలయ్య పైన ఈ సారి వైసీపీ మహిళా అభ్యర్దిని పోటీకి దించింది. ఇక్కడ పోటీ ఆసక్తి కరంగా మారుతోంది. ఈ సమయంలో స్వామిజీ నిర్ణయం తో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.
కలిసొచ్చేదెవరికి
2019 ఎన్నికల్లో వైసీపీ ఉమ్మడి అనంత జిల్లాలో రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. పయ్యావుల కేశవ్, బాలయ్య విజయం సాధించారు. రెండు ఎంపీ స్థానాలతో పాటుగా మిగిలిన 12 స్థానాలు వైసీపీ గెలుచుకుంది. తొలి నుంచి హిందూపురం పార్లమెంట్ పరిధిలో టీడీపీ పట్టు కొనసాగుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి, తిరిగి ఈ సారి ఎన్నికల్లోనూ అదే తీరును సీట్లు సాధించాలని భావిస్తోంది. హిందూపురం ఎంపీ అభ్యర్దిగా శాంతమ్మను ఖరారు చేసారు. ఈ సమయంలో హోరా హోరీగా మారుతున్న ఎన్నికల్లో స్వామిజీ పోటీ నిర్ణయం పైన కూటమిలో చర్చ మొదలైంది. దీంతో, నామినేషన్ల సమయానికి హిందూపురం లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications