పరిటాల కేసు రీ-ఓపెన్, జగన్‌కు తెలియదు: పత్తిపాటి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉండటం రాష్ట్ర ప్రజల దురదృష్టమన్నారు. శాంతిభద్రతలపై వాస్తవాలను వినలేక జగన్ అండ్ కో సభ నుంచి పారిపోయారన్నారు. వాస్తవానికి జగన్‌కు జైలు - అసెంబ్లీలకు తేడా తెలియదని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ప్రజలందరి మనోభావాలను అద్దంపట్టే శాసనసభ దేవాలయం లాంటిదన్నారు. సభలో చర్చ జరిగితే తమ నేరిచరిత్ర అంతా బయటకు వస్తుందనే భయంతోనే ఆయన వాకౌట్‌చేసి పారిపోయారన్నారు.
అసలు శాంతిభద్రతలపై మాట్లాడే అర్హత, నైతికత జగన్‌కు లేదన్నారు. రుణమాఫీ ప్రక్రియను రెండునెలల్లోగా పూర్తిచేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటోందని పుల్లారావు పేర్కొన్నారు. బడ్జెట్‌లో 5వేల కోట్లరూపాయలు మాత్రమే కేటాయించినప్పటికీ సర్కారుకు వివిధ కీలకశాఖల ద్వారా వచ్చే ఆదాయాన్ని సెక్యూరిటైజ్ చేయడం ద్వారా నిధులను సేకరిస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications