మొండి నా కొడుకులం.. బండ నా కొడుకలం: పరిటాల శ్రీరామ్ ఆవేశపూరిత ప్రసంగం..

మాకు హాని తలపెట్టని వాళ్లంతా మావాళ్లే. మావాళ్లకు హాని తలపెట్టే ప్రతి ఒక్కడూ మాకు శత్రువే అన్నారు.

అనంతపురం: అనంత రాజకీయాల్లో పవర్ ఫుల్ లీడర్‌గా పేరు తెచ్చుకున్నపరిటాల రవి మరణానంతరం ఆయన సతీమణి సునీత రాజకీయాల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరికి ముగ్గురు సంతానం కాగా, పెద్ద కుమారుడు శ్రీరామ్.. తండ్రి పరిటాల రవి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో శ్రీరామ్ పొలిటికల్ ఎంట్రీ ఉండవచ్చునని భావిస్తున్న తరుణంలో.. తల్లి సునీత వెంట ఆయన పలు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో జరిగిన ఓ సభలో మాట్లాడిన శ్రీరామ్, ఆవేశంగా ప్రసంగించారు.

Paritala Sriram Speech in Public Meeting

'మేము మొండి నా కొడుకులం. బండనా కొడుకులం. మాకు హాని తలపెట్టని వాళ్లంతా మావాళ్లే. మావాళ్లకు హాని తలపెట్టే ప్రతి ఒక్కడూ మాకు శత్రువే. రాబోయే రోజుల్లో పరిటాల చెప్పిన మాటలు, ఆయన చేసిన ప్రాణత్యాగం స్ఫూర్తితో ముందుకు సాగుతాం' అని శ్రీరామ్ ఆవేశంగా మాట్లాడారు.

తన కుటుంబానికి పరిటాల అభిమానులు అండగా నిలవాలని ఆకాంక్షించిన ఆయన.. కార్యకర్తలే తమ నిజమైన బలమని వ్యాఖ్యానించారు. శ్రీరామ్ ప్రసంగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో హల్‌చల్ చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+