వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విపక్ష సభ్యుల ఆందోళనలతో లోక్‌సభ , రాజ్యసభ వాయిదా

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై వైసీపీ, టిడిపిలు అవిశ్వాస నోటీసులు ఇచ్చాయి. తమ అవిశ్వాస నోటీసుకు సంబంధించి ఇప్పటికే 50 మంది ఎంపీలు సంతకాలు చేశారని టిడిపి ఎంపీలు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు తెలిపారు.వైసీపీ కూడ అవిశ్వాసంపై మద్దతును కూడ గడుతోంది. ఈ రెండు పార్టీలు ఇప్పటికే అవిశ్వాస నోటీసులను అందించాయి.అయితే ప్రారంభమైన కొద్దిసేపటికే లోక్‌సభ వాయిదా పడింది.

Recommended Video

No Confidence Motion : మళ్లీ అవిశ్వాస నోటీసులు, ఏం జరుగుతుంది...?
Parliament Session LIVE UPDATES: Three no-confidence motions against Modi govt, will House function?

విపక్ష సభ్యుల ఆందోళనల నేపథ్యంలో లోక్‌సభను సోమవారం నాడు ప్రారంభం కాగానే వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ సుమిత్రా మహజన్ ప్రకటించారు.

వైసీపీ, టిడిపిల నోటీసులు లోక్‌సభ స్పీకర్‌ ముందుకు రానున్నాయి..సభ ప్రారంభమైన 30 సెకన్లకే లోక్‌సభ వాయిదా పడింది.మధ్యాహ్నం 12 గంటల వరకు సభ వాయిదా వేస్తూ స్పీకర్ సుమిత్రా మహజన్ నిర్ణయం తీసుకొన్నారు.

రాజ్యసభలో కూడ ఇదే పరిస్థితి కొనసాగింది. రాజ్యసభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు తమ డిమాండ్ల సాధన కోసం వెల్‌లోకి వచ్చి ఆందోళన చేశారు. అయితే ఈ విషయమై రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడు పదే పదే విన్నవించినా పరిస్థితుల్లో మార్పు రాలేదు. దీంతో రాజ్యసభను రేపటికి వాయిదా వేస్తూ వెంకయ్యనాయుడు నిర్ణయం తీసుకొన్నారు.

English summary
The second phase of the Budget session that resumed on March 5 has seen continuous disruptions. Follow this space to track all the latest developments in Lok Sabha and Rajya Sabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X