నిత్యావసరాలకు కుటుంబంలో ఒక్కరికే పాస్ ..లక్ష బెడ్లతో క్వారంటైన్ : ఏపీ ప్రభుత్వ నిర్ణయం
ఏపీలో కరోనా కేసుల తీవ్రత ఎక్కువ అవుతున్న నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. లాక్ నిందనలు అమలవుతున్న వేళప్రజలను కట్టడి చెయ్యటానికి ప్రయత్నాలు సాగిస్తుంది. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంపై ఫోకస్ పెట్టిన ఏపీ ప్రభుత్వం కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న క్లస్టర్లలో నిత్యావసరాలకు ఒక్కరికి మాత్రమే అనుమతి ఇవాలని ఇక వారికి పాస్ ను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది .
కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలలో నిత్యావసరాల కోసం కుటుంబంలో ఒక వ్యక్తికి మాత్రమే పాస్ లు ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. శనివారంకరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఇక ఈ నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక వివిధ రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చే పరిస్థితులపై కూడా సమీక్షలో మాట్లాడిన సీఎం జగన్ తాజాగా కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలపై చర్చించారు. ఇక ఈ సమయంలోనే కేసుల తీవ్రత ఉన్న క్లస్టర్లలో ప్రజల కదలికలను కట్టడి చేసి నిత్యావసరాలకోసం ఒక వ్యక్తికే పాసు ఇవ్వాలన్న కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే మండలాల వారీగా ఇంటికి ఒకరికి కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచించిన సీఎం జగన్ పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్న నేపధ్యంలో క్వారంటైన్ సెంటర్లను పెంచాలని ఆదేశించారు.ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని కనీసం 10 నుంచి 15 మందికి క్వారంటైన్ వసతి కల్పించాలని చెప్పారు. వారికి కావాల్సిన మౌలిక వసతులు కల్పించాలని భోజనం, సదుపాయాలు, బెడ్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కనీసం లక్ష బెడ్లు సిద్ధం చేసుకోవాలని చెప్పిన జగన్ క్వారంటైన్ విషయంలో కూడా నిర్లక్ష్యం తగదని పేర్కొన్నారు. ఇక వీరి కోసం కనీసం 500 ఆర్టీసీ బస్సులను నిత్యావసరాలను తీసుకెళ్లే మొబైల్ వాహనాలుగా మార్చాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు . ముఖ్యంగా ప్రజలను బయట తిరగకుండా ఇంటికి ఒక్కరికి మాత్రమే నిత్యావసరాలకు పాస్ ఇవ్వనున్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications