రాత్రికి పిలిచి.. దైవ కృప పేరుతో నగ్నంగా!: ఎంతోమందిని అలా.. పాస్టర్ వికృత లీలలు!

తణుకు మండలం దువ్వకు చెందిన ఎబినేజర్‌ తల్లిదండ్రులు జీవనోపాధి నిమిత్తం చాలా ఏళ్ల క్రితం జగన్నాథపురం వచ్చి స్థిరపడ్డారు. ఇక్కడే ఎబినేజర్‌ పుట్టాడు. అక్కడే చర్చి ఫాదర్‌గా ఎదిగిన అతను.. సియోన్‌ అనే మహిళను

తాడేపల్లిగూడెం: పాపాలను పోగొడుతానన్న నెపంతో మహిళలను లైంగికంగా లోబర్చుకుని వారి జీవితాలతో ఆటలాడుతున్న ఓ చర్చి పాస్టర్ ఉదంతం పశ్చిమ గోదావరి జిల్లాలో బయటపడింది.

డేరా బాబా ఆకృత్యాలను తలపించే రీతిలో ఎబినేజర్ అనే పాస్టర్ మహిళలను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నాడు. అయితే అతని మాయలో పడిన మహిళలు సైతం.. ఎబినేజర్ ను వదిలి రావడానికి నిరాకరిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒక రకమైన హిప్నాటిజం ద్వారా ఎబినేజర్ వారిని వలలో వేసుకున్నాడా? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

ఎవరీ ఎబినేజర్?:

ఎవరీ ఎబినేజర్?:

తణుకు మండలం దువ్వకు చెందిన ఎబినేజర్‌ తల్లిదండ్రులు జీవనోపాధి నిమిత్తం చాలా ఏళ్ల క్రితం జగన్నాథపురం వచ్చి స్థిరపడ్డారు. ఇక్కడే ఎబినేజర్‌ పుట్టాడు. అక్కడే చర్చి ఫాదర్‌గా ఎదిగిన అతను.. సియోన్‌ అనే మహిళను 2003లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె ఉంది.

అయితే ఎబినేజర్‌ వేధింపులు తాళలేక భార్య అతనికి దూరంగా ఉంటోంది. ఇటీవల ఎబినేజర్ ఆకృత్యాలు బయటపడుతుండటంతో ఆమె స్పందించింది.'పెళ్లయిన తొలి ఏడాది బాగున్నాడు. ఆపై చెప్పుకోలేని రీతిలో చిత్రవధ చేశాడు. నా కళ్ల ముందే పరాయి స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఇక అతనితో ఉండటం ఇష్టం లేక బయటకొచ్చేశా. నాకు భరణం ఇప్పిస్తే.. నా బతుకు నేను బతుకుతా' అని సియోను కన్నటీ పర్యంతం అయ్యారు.

భార్య విడిచిపెట్టింది..:

భార్య విడిచిపెట్టింది..:

పాస్టర్ కావడంతో ఎబినేజర్ అంటే అందరూ గౌరవంగానే చూసేవారు. మహిళలు కూడా అదే గౌరవంతో వ్యవహరించేవారు. అయితే మహిళలిచ్చే గౌరవాన్ని ఆసరాగా చేసుకుని ఎబినేజర్ వారికి దగ్గరయ్యేవాడు.

భార్య కూడా వెళ్లిపోవడంతో తన ఆగడాలకు అడ్డుపడేవారే లేకుండా పోయారు. దీంతో ప్రకాశరావుపాలెం, జగన్నపేట, మద్దూరు తదితర ప్రాంతాల్లోని చర్చిల పర్యవేక్షకుడిగా.. అక్కడికి వచ్చే మహిళలను లోబరుచుకునేందుకు ప్రయత్నించేవాడు.

రాత్రికి రమ్మని.. నగ్నంగా మార్చి

రాత్రికి రమ్మని.. నగ్నంగా మార్చి

ప్రార్థనల కోసం చర్చిలకు వచ్చే మహిళలను ఏదో ఒకవిధంగా లోబరుచుకుని రాత్రికి తన వద్దకు రప్పించుకునేవాడు. ఎబినేజర్ ఎక్కువగా జగన్నాథపురం చర్చిలోనే గడుపుతుంటాడని చెబుతారు.

అమాయక మహిళలు ఎబినేజర్ మాటలు విని జగన్నాథపురం చర్చికి వచ్చేవారు. అలా రాత్రివేళల్లో దైవాన్ని చూపిస్తానని చెప్పి.. మహిళలను నగ్నంగా మార్చేవాడు. నగ్నంగా ప్రార్థిస్తేనే దైవం అనుగ్రహిస్తాడని ఒత్తిడి తెచ్చేవాడు.

అలా ఎంతోమంది మహిళలను లైంగికంగా లోబరుచుకున్నాడు. ఈ క్రమంలో 2015లో ఎబినేజర్‌పై తొలి కేసు నమోదయింది. అరెస్టు భయంతో కొంతకాలం కనిపించకుండాపోయాడు. ముందస్తు బెయిల్‌ తీసుకొని.. తిరిగి మహిళలను వంచించడం మొదలుపెట్టాడు.

పాప కార్యాలకు అడ్డా:

పాప కార్యాలకు అడ్డా:

చర్చిలో జరుగుతున్న అసాంఘీక కార్యకలాపాలపై పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో పోలీసులు జగన్నాథపురం చర్చిని మూసివేయించారు. అయినా సరే, ఎబినేజర్ తీరులో మాత్రం మార్పు రాలేదు.

మరోచోట చర్చిని నిర్మించి శుక్ర, ఆదివారాల్లో ప్రార్థనలకు వచ్చే యువతులను, వివాహితులను, వితంతువులను ప్రత్యేక ప్రార్థనల పేరిట నమ్మించి వంచించేవాడు. వారి వద్ద ఉండే విలువైన ఆభరణాలను తీసుకోవడంతో పాటు, శారీరకంగా లోబరుచుకునేవాడు. ఇదే క్రమంలో కోర్టు అతనిపై నమోదైన కేసును కొట్టివేయడంతో మరింత రెచ్చిపోయాడు.

బాధితుల గోడు:

బాధితుల గోడు:

ఎబినేజర్ ఉచ్చులో చిక్కుకున్న ఎంతోమంది స్త్రీలు అతని వల్ల దారుణంగా మోసపోయారు. పెళ్లయిన తమ కూతురిని లోబరుచుకుని, కాపురానికి వెళ్లనివ్వడం లేదని ఒకరు.. తమ కుమార్తెను వెంట తిప్పుకుంటూ, ఆఖరికి తమను కూడా చూడనీయం లేదని మరొకరు.. దేవుని పేరిట నగలు దోచుకున్నాడని మరొకరు ఇలా ఎబినేజర్ బాధితులంతా తమ గోడు వెల్లబోసుకుంటున్నారు.

ఇటీవల ఓ మహిళను ప్రత్యేక ప్రార్థనల పేరిట ఎబినేజర్ చర్చికి పిలిపించాడు. రాత్రివేళ ఆమెను నగ్నంగా మారాలని ఆదేశించాడు. ఎందుకని ప్రశ్నిస్తే.. దేవుని కృప దొరుకుతుందని మాయ మాటలు చెప్పాడు. అయితే అతని చర్యలను పసిగట్టిన మహిళ అక్కడి నుంచి పరారై వచ్చింది.

బాధితులకు అండగా నన్నపనేని:

బాధితులకు అండగా నన్నపనేని:

ఫాదర్‌ అనే అభిమానంతో కొంత, అతడి పలుకుబడికి భయపడి మరికొంత బాధిత మహిళలు అతని ఆగడాలపై పెదవి విప్పడానికి భయపడ్డారు. అయితే రాను రాను ఎబినేజర్‌ వేధింపులు తీవ్రం కావడంతో.. ఇప్పుడు వారంతా ఏకమై గొంతు విప్పారు. వీరికి మద్దతుగా బుధవారం రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి జగన్నాథపురం వచ్చారు. పాస్టర్‌ దగ్గర చిక్కుకుపోయిన తమ బిడ్డలను విడిపించాలని బాధిత తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.

డేరా బాబా లాగే:

డేరా బాబా లాగే:


రాష్ట్రంలో మరో డేరా బాబాలా తయారయిన ఎబినేజర్‌పై చర్య తీసుకోవాలని కలెక్టర్‌, ఎస్పీలను నన్నపనేని కోరారు. ఫాదర్‌ ఆధీనంలోని యువతులను, వివాహితలను బయటకుతెచ్చి.. మహిళా హాస్టల్‌లో ఉంచుతామని భరోసా ఇచ్చారు.

'ఎబినేజర్‌ను వదిలిపెట్టం. మీరు ఒక్క ఫిర్యాదు ఇవ్వండి. అతని ఆట కట్టిస్తాం. ఎవరూ భయపడొద్దు. మీ వెంట కమిషన్‌, ప్రభుత్వం ఉన్నాయనేది మరిచిపోవద్దు' అని ధైర్యం చెప్పారు. ఓ ఐదుగురు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. కాగా, ఎబినేజర్‌కి అనుకూలంగా కొంతమంది జగన్నాథపురంలో ధర్నా జరిపారు.

ఫిర్యాదు చేస్తే బెదిరింపులు:

ఫిర్యాదు చేస్తే బెదిరింపులు:

ఎబినేజర్ ఆగడాలకు అంతూ పొంతూ లేకుండా పోవడానికి కారణం.. అతనికి ఎవరూ ఎదురు తిరిగే సాహసం చేయకపోవడమే. ఒకవేళ అలాంటి ప్రయత్నం చేసినా.. ఎబినేజర్ తన అనుచరులు, రౌడీలతో బెదిరింపులకు దిగేవాడు. అవసరమైతే దాడులు కూడా చేయించేవాడు. ఇదే తరహాలో.. ఓ కేసులో సాక్ష్యం చెప్పినందుకు తనపై కూడా దాడి చేయించాడని జగన్నాథపురం సర్పంచ్ ముత్యాల సత్యనారాయణ వాపోవడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+