తిరుపతిని సర్వనాశనం చేస్తున్న వైసీపీ త్రిమూర్తులు వీళ్లే, ఏడుకొండల వాడితో పెట్టుకుంటే, పవన్ !

ఏడు కొండలస్వామితో పెట్టుకుంటే ఎవరైనా అడ్రస్ లేకుండాపోతారని, గతంలో కూడా అదే జరిగిందని, స్వామి వారి సొమ్ము స్వాహా చేసి ఆ డబ్బుతో ఓట్లు కొనుక్కునే వాళ్లకు తగిన బుద్ది చెప్పాలని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. కోడిబొచ్చు అమ్ముకునే ఎమ్మల్యే మీకు అవసరం లేదని, ప్రజల కష్టాలు తీర్చే నాయకుడు, తిరుమల, తిరుపతి పవిత్రత కాపాడే నాయకుడు మీకు కావాలని పవన్ కల్యాణ్ అన్నారు.

తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆవేశంగా మాట్లాడారు. తిరుపతిలో ఎవరైనా ఇల్లు కట్టాలన్నా, ఎలాంటి మంచి పనులు చెయ్యాలన్నా ఈ ప్రాంతం ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి 30 శాతం, ఆయన కొడుక్కి 10 శాతం లంచంగా డబ్బులు ఇవ్వాలని, తండ్రీకొడుకులు ఇద్దరూ లంచాలను వాటాలుగా పంచుకుంటున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. అలాంటి భూమన కుటుంబానికి మీరు మరోసారి ఓట్లు వేస్తారా అని పవన్ కల్యాణ్ తిరుపతి ప్రజలను ప్రశ్నించారు.

Pawan Kalyan accused YV Subbareddy and Karunakar Reddy of destroying the sanctity of Tirumala

వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల పవిత్రను దెబ్బ తీశారని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల ఆధ్యాత్మిక కేంద్రం అని మరిచిపోయిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఆ ఆధ్యాత్మిక కేంద్రాన్ని తిరుమల రిసార్టు చేసేశారని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమల పవిత్రతను కాపాడుకుంటామని, ఏడుకొండల స్వామితో ఆటలు ఆడుకుంటే అది ఎవరైనా సరే అడ్రస్ లేకుండాపోతారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.

తిరుమల లడ్డూ సైజు తగ్గించారు, తిరుమల లడ్డూ నాణ్యత తగ్గించేశారని, వైసీపీ నాయకులు తిరుపతిని అడ్డాగా చేసుకుని రౌడీయిజం చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. నెలకు రూ 20 లక్షలకు కోడిబొచ్చు అమ్ముకునే ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు మీకు కావాలా, ప్రజల కోసం కష్టపడి పని చెయ్యడానికి ఇక్కడికి వచ్చిన అరణి శ్రీనివాసులు మీకు కావాలా, ఆ విషయం మీరే తేల్చుకోవాలని పవన్ కల్యాణ్ తిరుపతి ప్రజలకు సూచించారు.

తిరుపతి ప్రజలు ధైర్యంగా గాజుగ్లాసు గుర్తుకు ఓటు వేసి కూటమి అభ్యర్థి అరణి శ్రీనివాసులను గెలిపించాలని పవన్ కల్యాణ్ మనవి చేశారు. తిరుపతిని పెద్దిరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి అనే వైసీపీ త్రిమూర్తులు లూటీ చేశారని, టీడీఆర్ బాండ్లలో రూ 200 కోట్లు స్వాహా చేశారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్దిరెడ్డి, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి దగ్గర ఆ డబ్బులు కక్కిస్తామని, తిరుపతి ప్రజలు నమ్మాలని పవన్ కల్యాణ్ అన్నారు.

Pawan Kalyan accused YV Subbareddy and Karunakar Reddy of destroying the sanctity of Tirumala

గతంలో మెగాస్టార్ చిరంజీవిని తిరుపతి ప్రజలు గెలిపించారని, తిరుపతిని ఎంతో సేవచెయ్యాలని చిరంజీవి చేపట్టిన అనేక మంచిపనులకు తరువాత బ్రేక్ పడిందని, చిరంజీవి తిరుపతికి ఏం చెయ్యాలని అనుకున్నారో అది నేను కచ్చితంగా చేస్తానని, తిరుమల, తిరుపతి పవిత్రతను కాపాడటానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతి ప్రజలకు మనవి చేశారు.

కరుణాకర్ రెడ్డి ఇచ్చే డబ్బులు మీరు తీసుకోవాలని, అది తిరుమల హుండీలో లూటీ చేసిన డబ్బు కాబట్టి ఆ డబ్బులను ప్రజలు హుండీలోనే వెయ్యాలని, స్వామివారి డబ్బును మానం వాడుకోవడం మంచిది కాదని పవన్ కల్యాణ్ తిరుపతి ప్రజలకు మనవి చేశారు. టీటీడీ నిధులు, స్వామివారి డబ్బును శ్రీవారికి, తిరుపతి ప్రజల కోసమే ఖర్చు చేస్తామని, భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబానికి మరోసారి ఓటు వేస్తే వాళ్లు తిరుపతిని అడ్డంగా దోచుకుంటారని పవన్ కల్యాణ్ ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+