మంత్రి పదవులకు పవన్, లోకేష్ దూరం - కీలక బాధ్యతలు..!?
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. భారీ మెజార్టీతో విజయం సాధించిన మూడు పార్టీల కూటమి నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ఈ నెల 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రివర్గం పైన కసరత్తు చేస్తున్నారు. పవన్ కల్యాణ్, లోకేష్ కేబినెట్ లో ఉంటారనే ప్రచారం ఉన్నా..వ్యూహం మార్చినట్లు కనిపిస్తోంది. పవన్ కల్యాణ..లోకేష్ నిర్వహించనున్న పాత్ర పైన ఆసక్తి పెరుగుతోంది.
చంద్రబాబు కసరత్తు
చంద్రబాబు కొత్త ప్రభత్వం ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. చంద్రబాబు తో పాటుగా కొత్త మంత్రివర్గం కొలువు తీరనుంది. టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి మంత్రులుగా ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశం పైన ముఖ్యనేతలు ప్రాధమికంగా చర్చలు చేసారు. మొత్తం 25 మంది ఉండే మంత్రివర్గంలో టీడీపీ నుంచి చంద్రబాబుతో సహా 20 మంది, జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఇద్దరికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే, పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రచారం సాగినా..ఇప్పుడు వ్యూహం మార్చినట్లు కనిపిస్తోంది. పవన్ మంత్రివర్గంలో చేరకూడదనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

పవన్ కీలక పాత్ర
పవన్ కల్యాణ్ ఒక మంత్రిగా కంటే..పార్టీ అధినేతగానే ప్రభుత్వానికి సహకారం అందిస్తూ..ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో కీలకంగా వ్యవహరించాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. పవన్ తన తుది నిర్ణయం ఏంటనేది వెల్లడించాల్సి ఉంది. అదే విధంగా.. లోకేష్ పాత్ర పైన టీడీపీలో చర్చ మొదలైంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటంతో..మంత్రిగా పని చేయటం కంటే లోకేష్ పార్టీ వ్యవహారాల పైనే ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది. గతంలో అధికారంలో ఉన్న సమయంలో పార్టీ కేడర్ ను పట్టించుకోలేదనే విమర్శ ఉంది. ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తుండటంతో పార్టీ కేడర్ కు లోకేష్ అందుబాటులో ఉంటూ..పార్టీ - ప్రభుత్వం మధ్య సమన్వయకర్తగా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తోంది
లోకేష్ నిర్ణయం ఏంటి
దీంతో..జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, కొణతాల రామక్రిష్ణ, బొలిశెట్టి సత్యనారాయణ కు జనసేన నుంచి కేబినెట్ లో ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. బీసీ వర్గానికి దక్కే డిప్యూటీ సీఎం పదవి ఉత్తరాంధ్ర నుంచి కొణతాలకు ఇచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. నిమ్మకాయల చినరాజప్ప లేదా నిమ్మల రామానాయుడుకు కాపు కోటాలో డిప్యూటీ సీఎంగా ఛాన్స్ దక్కుతుందని భావిస్తున్నారు. ఈ సారి మైనార్టీ ల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లోనూ ఎన్డీఏ కూటమి అభ్యర్దులను గెలిపించటంతో ఫరూక్ కు మంత్రి పదవి ఖాయంగా కనిపిస్తోంది. స్పీకర్ విషయంలో మూడు పార్టీల నుంచి ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications