అందుకే పార్టీ పెట్టా: పవన్, తుస్సుమంది: రాఘవులు

విజయవాడ/హైదరాబాద్: రాజకీయాలపై ప్రజలలో అవగాహన కల్పించడానికే జనసేన పార్టీని స్థాపించినట్లు ఆ పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ శుక్రవారం చెప్పారు. ఉదయం ఆయన విశాఖపట్నం నుండి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను మీడియా పార్టీపై అడిగింది. ఎవరెవరో తెలియకుండా తాను ప్రచారం చేయనని స్పష్టం చేశారు.

రాఘవులు కౌంటర్

Pawan Kalyan clarifies Jana Sena

భారతీయ జనతా పార్టీ ప్రదానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని ప్రధానిని చేద్దామంటూ విశాఖ సభా వేదికగా పవన్ కల్యాణ్ పిలుపునివ్వడంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు స్పందించారు. జనసేన ప్రజల కోసమనుకుంటే... మోడీని ప్రధానిని చేసేందుకు వచ్చినట్లుందని ఎద్దేవా చేశారు. పవన్ ఇజం మోడీ ఇజంలా ఉందన్నారు. ఎన్నికల నేపథ్యంలో పార్టీల నుంచి నేతల ఫిరాయింపులు కొనసాగుతున్నాయని చెప్పారు. పవన్ విశాఖ ఇజం తుస్సుమందన్నారు. మోడీతో చేతులు కలపడం దురదృష్టకరమన్నారు. పొత్తు కోసం జగన్ ముందుకొస్తే తాము ఆలోచిస్తామన్నారు.

పొత్తులపై ఊహాగానాలు వద్దు: కెకె

పొత్తులపై ఎలాంటి ఊహాగానాలు వద్దని తెరాస నేత కె కేశవ రావు అన్నారు. తాను ఢిల్లీకి వెళ్లడం లేదని చెప్పారు. కాంగ్రెసు పార్టీతో ఎలాంటి చర్చలు జరపడం లేదన్నారు.

హైదరాబాదుకు పొన్నాల

తెలంగాణ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఐతో పొత్తుపై చర్చలు కొనసాగిస్తామని వెల్లడించారు. ప్రతిపాదన వస్తే తెరాసతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+