Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేబినెట్ లోకి నాగబాబు, ముహూర్తం ఫిక్స్ - జనసేన మంత్రుల మార్పు..!?

మెగా బ్రదర్ నాగబాబు ఏపీ కేబినెట్ లో చేరేందుకు రంగం సిద్దమైంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు నాగబాబు ఏపీ మంత్రి కావటం ఖాయమైంది. ఎమ్మెల్సీ గా ఎన్నికైన నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలని గతంలోనే నిర్ణయించారు. ఇదే సమయంలో మంత్రివర్గ ప్రక్షాళన దిశగా చర్చ జరిగింది. అయితే, సామాజిక - పార్టీ సమీకరణాలు దెబ్బ తినకుండా నాగబాబును మంత్రివర్గం లోకి తీసుకునే కొన్ని కీలక నిర్ణయాలు తప్పవని తెలుస్తోంది. అందులో భాగంగా కొత్త ఫార్ములా అమలు దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

కీలక పరిణామాలు
నాగబాబు 2024 ఎన్నికల సమయంలో అనకాపల్లి ఎంపీగా.. ఆ తరువాత రాజ్యసభకు పంపేలా తొలుత పవన్ భావించారు. అయితే, పొత్తుల లెక్కల్లో భాగంగా ఎంపీ సీటు.. రాజ్యసభ స్థానం రెండు నాగబాబుకు దక్కలేదు. దీంతో, ఏపీ మంత్రివర్గంలో నాగబాబుకు అవకాశం ఇవ్వనున్నట్లుగా నేరు గా చంద్రబాబు ప్రకటించారు. ఆ తరువాత నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. అయితే, నాగబాబును మంత్రి చేయటం ద్వారా పవన్ తన కుటుంబ సభ్యులకే ప్రాధాన్యత ఇచ్చారని.. ఒకే వర్గానికి జనసేన నుంచి మూడు మంత్రి పదవులు ఇచ్చినట్లు అవుతుందనే చర్చ తెర మీదకు వచ్చింది. దీనిని పవన్ తొలుత సమర్ధించుకున్నా.. ఆ తరువాత పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. రాజకీయంగా విమర్శకుల అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు.

pawan-kalyan-decision-becomes-crucial-amid-nagababu-to-induct-in-ap-cabinet

ముహూర్తం ఫిక్స్
నాగబాబును మంత్రిని చేసేందుకు దాదాపు ముహూర్తం ఖరారైంది. ఆషాడ మాసం తరువాత మంత్రివర్గంలోకి నాగబాబు ఎంట్రీ ఉండేలా నిర్ణయించారు. జూలై చివరి వారంలోనే స్వల్ప ప్రక్షాళనతో నాగబాబుకు మంత్రి పదవి దక్కేలా ప్రణాళికలు సిద్దం అవుతున్నట్లు సమాచారం. అందులో భాగంగా జనసేన నుంచి ప్రస్తుతం ముగ్గురు మంత్రులు ఉన్నారు. అందులో బీసీ, ఎస్సీ వర్గాలకు అవకాశం ఇవ్వకపోవటం పైన చర్చ జరుగుతోంది. ఇప్పుడు నాగబాబుకు ఇవ్వటం ద్వారా మరోసారి కాపు వర్గానికే పార్టీలో పదవులు ఇస్తున్నారనే చర్చకు అవకాశం వస్తుంది. దీంతో, కొత్త ఫార్ములా పైన చర్చ చేస్తున్నట్లు పార్టీ నేతల సమాచారం.

పవన్ నిర్ణయం ఏంటి
అందులో భాగంగా నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకునే సమయంలోనే జనసేన నుంచి ఒక మంత్రికి రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చి .. ఆ స్థానంలో బీసీ నేతకు మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచన జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. నాగబాబు కోసం పార్టీ నుంచి ఉన్న మంత్రిని తప్పిస్తే ఎలాంటి స్పందన ఉంటుందనే సందేహం వెంటాడుతోంది. తప్పించిన మంత్రి స్థానంలో ఉత్త రాంధ్ర నుంచి బీసీ వర్గానికి చెందిన కొణతాల రామక్రిష్ణకు అవకాశం ఇస్తారని చెబుతున్నారు. అయితే, ఈ ఫార్ములా పైన పవన్ దే తుది నిర్ణయం కానుంది. నాగబాబుకు మంత్రి పదవి ఖాయం గా కనిపిస్తున్న వేళ... ఇప్పుడు పవన్ తన పార్టీ నుంచి మంత్రుల విషయంలో సామాజిక సమీకరణా లు దెబ్బ తినకుండా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+