పులివెందులలో మున్సిపాల్టీకి భిన్నంగా ZPTC అనూహ్య ఫలితాలు..!!
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపులో ఆసక్తికర ఫలితాలు వస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో కూటమి పార్టీలు ఏకపక్షంగా విజయం సాధించాయి. అయితే, జెడ్పీటీసీ ఫలితాల్లో మాత్రం కొంత భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. కడప జిల్లాలో మొత్తం 39 జెడ్పీటీసీలు ఉండగా అందులో 22 ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన వాటికి పోలింగ్ జరగ్గా.. పులివెందుల జెడ్పీటీసీ టీడీపీ గెలిచింది. కాగా... ఇదే నియోజకవర్గంలో మరో మూడు జెడ్పీటీసీలను వైసీపీ గెలుచుకోవటంతో రాజకీయంగా కొత్త చర్చ మొదలైంది.
కడప జిల్లాలో జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల పైన ఎంపీ అవినాశ్ రెడ్డి స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ రోజు ప్రకటించిన ఫలితాల్లో పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలను టీడీపీ కైవసం చేసుకుంది. పులివెందులలో 1,463 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి భారతి విజయం సాధించగా.. మైదుకూరులో 18,903 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి కృష్ణకిషోర్ గెలుపొందారు. పులివెందుల నియోజకవర్గంలో మొత్తం 65 ఎంపీటీసీ స్థానాల్లో 64 స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. వేంపల్లి మండలం రెడ్డిపల్లి ఎంపీటీసీకి మాత్రమే ఎన్నిక జరిగింది. అలిరెడ్డిపల్లిలో కూడా 29 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. అటు.. బద్వేల్ నియోజకవర్గం కాశినాయన మండలం జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి ఓబులమ్మ ఘన విజయం సాధించారు.

జెడ్పీటీసీల్లో వైసీపీకి ఊరట
అయితే, పులివెందుల నియోజకవర్గ పరిధిలోని వేముల జెడ్పీటీసీగా వైసీపీ అభ్యర్ధి సత్య ప్రభావత మ్మ 1569 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వేంపల్లి జెడ్పీటీసీ స్థానంలో 19,192 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్ధి బత్తల వెంకట శివమ్మ విజయం సాధించినట్లు ఎంపీ అవినాశ్ రెడ్డి వెల్లడించారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే ఇదే ఫలితం వస్తుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో అధికా రాన్ని దుర్వినియోగం చేశారని ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. 2021లో కుప్పంలో టీడీపీ ఓడిపోయిందని గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో సగానికి పైగా బూత్‌లలో రిగ్గింగ్ జరిగిందని, తప్పుడు కేసులు, దాడులు, దౌర్జన్యాలతో ఎన్నికలు నిర్వహించారని విమర్శించారు. పులివెందులలో నైతికంగా వైసీపీదే విజయమని అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు.













Click it and Unblock the Notifications
