కష్టకాలంలో వాళ్లే లేకుంటే..: పవన్ ఎమోషనల్

Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. సింగపూర్ నుంచి స్వదేశానికి తిరిగొచ్చారు. ఆయన వెంట భార్య అన్నా లెజ్నోవా, కుమార్తె, తనయుడు మార్క్ శంకర్, కాకినాడ లోక్‌సభ సభ్యుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు. విమానాశ్రయంలో కొందరు పార్టీ నాయకులు వారికి స్వాగతం పలికారు.

పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్.. సింగపూర్‌ పాఠశాలలో సంభవించిన అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. రివర్ వ్యాలీ రోడ్‌లో మూడంతస్తుల భవనం సోప్‌హౌస్‌లో గల టమాటో కుకింగ్ స్కూల్‌లో మంటలు చెలరేగిన ఘటనలో మార్క్ శంకర్‌తో పాటు 16 మంది చిన్న పిల్లలు గాయపడ్డారు.

Pawan Kalyan extend gratitude to PM Modi and High Commission of India in Singapore

ఈ ఘటనలో గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందించారు. మార్క్ శంకర్‌ చేతులు, కాళ్లకు కాలిన గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లో పొగ వెళ్లడం వల్ల ఐసీయూలో చికిత్స అందించాల్సి వచ్చింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, సురేఖ.. హుటాహుటిన సింగపూర్‌కు బయలుదేరి వెళ్లారు. డిశ్చార్జ్ అయ్యేంత వరకూ అక్కడే ఉన్నారు.

ఆరోగ్యం కుదుటపడిన నేపథ్యంలో ఇక తనయుడితో కలిసి పవన్ కల్యాణ్ స్వదేశానికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కుమారుడిని ఎత్తుకుని కనిపించారు పవన్. ఆయన పక్కనే అన్నా లెజ్నోవా ఉన్నారు.

ఇక్కడికి వచ్చిన అనంతరం తన వ్యక్తిగత ఎక్స్ అకౌంట్‌లో ఓ ట్వీట్ పోస్ట్ చేశారు పవన్ కల్యాణ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి కార్యాలయం, సింగపూర్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం, ఆ దేశ అధికార యంత్రాంగం, జనసేన నాయకులు, కార్యకర్తలు, పార్టీ క్యాడర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియజేశారు. కష్ట సమయంలో అన్ని విధాలుగా సహకరించినందుకు ధన్యవాదాలు చెప్పారు. తనకు ఎంతో భరోసా ఇచ్చారని అన్నారు.

Pawan Kalyan extend gratitude to PM Modi and High Commission of India in Singapore

తాను ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతంలో అడవి తల్లి బాట కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని వివరించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యకలాపాలను ప్రారంభిస్తోన్నప్పుడు.. ఈ వార్త అందిందని గుర్తు చేసుకున్నారు.

తన కుమారుడు, ఇతర పిల్లల కోసం ప్రధాని మోదీ, పీఎంఓ, సింగపూర్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం సకాలంలో జోక్యం చేసుకుందని చెప్పారు. ఇది- తన కుటుంబానికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. సవాళ్లతో కూడిన ఆ సమయంలో తన కుటుంబానికి మేమున్నామనే భరోసా ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో అడవి తల్లి బాట కింద ఇప్పటివరకు చేపట్టిన ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాల గురించి పవన్ కల్యాణ్ ఇదే ట్వీట్‌లో వివరించారు. గిరిజనుల అవసరాలను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల్లో అడవి తల్లి బాట ఒకటి అని వివరించారు. వారి జీవితాలను మార్చడానికి ఈ పథకం ఉపయోగపడుతోందని అన్నారు.

పీఎం జన్‌మన్, పీఎంజీఎస్‌వై, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ.. వంటి పథకాలం కింద 1,005 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో సుమారు 1,069 కిలో మీటర్ల రోడ్లను నిర్మిస్తోన్నామని, 601 గిరిజన ఆవాసాలలో కనెక్టివిటీని కల్పిస్తోన్నామని చెప్పారు. దీనివల్ల గిరిజనులు ఎదుర్కొంటోన్న డోలీ కష్టాలు తీరడమే కాకుండా అటు పర్యాటకరంగానికి కూడా ఊతమిచ్చినట్టవుతుందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+