పవన్ మాటిస్తే కేంద్రమైనా దిగిరావాల్సిందే..! ఇదే సాక్ష్యం..!
రాష్ట్రంలో కూటమి సర్కార్ లో ప్రధాన భాగస్వామిగా ఉంటూనే ప్రజలకు తాను ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవడంలో మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యంగా తనను తొలిసారి గెలిపించి అసెంబ్లీకి పంపిన పిఠాపురం నియోజకవర్గం విషయంలో అయితే అస్సలు రాజీపడటం లేదు. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం పరిధిలోకి వచ్చే ఏ గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు.
ఏపీలో గత ఎన్నికల సమయంలో తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఉప్పాడ గ్రామం వద్ద తీర ప్రాంతం భారీగా కోతకు గురవుతున్న విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. దీంతో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తీర ప్రాంతం కోతకు గురి కాకుండా కాపాడతామంటూ పవన్ హామీ ఇచ్చారు. ఈ మేరకు కేంద్రం వద్దకు ఇక్కడ తీర ప్రాంత రక్షిత గోడ కట్టాలని ప్రతిపాదనలు తయారు చేయించి పంపారు.

ఉప్పాడ వద్ద తీర ప్రాంతం కోతకు గురవుతుండటంతో ఈ గ్రామ ప్రజల ఇళ్లు సముద్రంలో కలిసి పోతున్నాయి. అంతే కాదు సముద్రం ఎప్పుడు వచ్చి తమ ఇళ్లను ముంచేస్తుందో, తనలో కలిపేసుకుంటుందో తెలియక ఇక్కడి మత్సకారులకు నిద్రపట్టడం లేదు. ఈ సమస్యను గమనించిన పవన్ కళ్యాణ్ కేంద్రానికి ఉప్పాడ వద్ద రక్షణ గోడ నిర్మాణం కోసం రూ.323 కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ పంపిన విజ్ఞప్తికి కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది.
ఉప్పాడ తీర ప్రాంత కోత నివారణకు శాశ్వత పరిష్కారం!!!
— JanaSena Party (@JanaSenaParty) July 16, 2025
The Central Government approved 323 Crores for #Uppada protection wall construction !#PawanKalyanForPithapuram#PawanKalyanAneNenu pic.twitter.com/4Khuu7Px3e
తాజాగా పవన్ కళ్యాణ్ పంపిన ఉప్పాడ రక్షిత గోడ నిర్మాణానికి అవసరమైన రూ.323 కోట్ల నిదుల కేటాయింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జనసేన పార్టీ తన ఎక్స్ హ్యాండిల్ ఈ విషయాన్ని సంతోషంగా షేర్ చేసింది. కేంద్రం ఇచ్చే నిధులతో ఉప్పాడ వద్ద రక్షిత గోడ నిర్మాణం జరిగితే ఇక అక్కడ గ్రామానికి సముద్ర ముప్పు తొలగిపోతుంది. ముఖ్యంగా తుఫాననులు వచ్చినప్పుడు, సముద్ర ఆటుపోట్లకు సైతం తీరం కోతకు గురికాకుండా ఉంటుందని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications