అకిరా నందన్‌ను మోడీకి పరిచయం చేసిన పవన్ కళ్యాణ్

న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి (టీడీపీ-బీజేపీ-జనసేన) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఏపీలో అత్యధిక అసెంబ్లీ స్థానాలతోపాటు ఎంపీ సీట్లను కూడా ఈ కూటమి కైవసం చేసుకుంది. ఇక, పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధించింది.

ఈ నేపథ్యంలో ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా లెజినోవా, కొడుకు అకిరా నందన్‌తో కలిసి ఢిల్లీ వెళ్లారు. ఈ క్రమంలోనే కొడుకు అకిరా నందన్‌ను ప్రధాని నరేంద్ర మోడీకిపవన్ కళ్యాణ్ పరిచయం చేశారు. పవన్ తోపాటు సతీమణి అన్నా లెజినోవా కూడా ఉన్నారు.

Pawan Kalyan meets PM Narendra Modi with his son Akira Nandan and wife anna lezhneva

కాగా, ఈ సందర్భంగా అకిరా నందన్ భుజంపై చేయి వేసి నరేంద్ర మోడీ మాట్లాడుతున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫొటోలను చూసిన పవన్, జనసేన అభిమానులు ఖుషీ అవుతున్నారు. వారసుడు అంటూ కామెంట్ చేస్తున్నారు. టాలీవుడ్ ఎంట్రీకి కూడా సిద్ధమవుతున్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

మరోవైపు, ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడకు పవన్ కళ్యాన్, లెజినోవా దంపతలు స్వాగతం పలికారు. ఆయనకు పుష్పగుచ్ఛం, శాలువా కప్పి సత్కరించారు. ఆ తర్వాత అక్కడే ఉన్న అకిరా నందన్ చంద్రబాబు నాయుడుకి పాదాభివందనం చేశారు. దీంతో చంద్రబాబు.. అకిరాను ఆశీస్సులు అందజేశారు.

మరోవైపు, ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు, పవన్, బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. కేంద్రంలోనూ చంద్రబాబు, పవన్ కీలకంగా మారారు. జూన్ 8 లేదా 9న ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేయనున్న క్రమంలో ఏపీ ఎంపీలంతా ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆ తర్వాత జూన్ 12న ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+