మంచి పౌరులుగా మసులుకుందాం: పవన్ కళ్యాణ్
హైదరాబద్: స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తితో మంచి పౌరులుగా, మంచి మనుషులుగా మసలుకుందామని నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. జాతీయ సమగ్రత, బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని అందరూ ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
68వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పవ కళ్యాణ్ శుక్రవారంనాడు న్ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 15 సందర్భంగా ప్రతి భారతీయుడికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

మన ముందు తరాల వారి త్యాగాలను గుర్తు చేసుకునేందుకు ఇదో మహత్తరమైన సందర్భమని అన్నారు. మన స్వాతంత్ర్యాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడేక్రమంలో సాయుధ బలగాల అలుపెరుగని సేవలను స్మరించుకుంటూ శాల్యూట్ చేసేందుకు ఇది తరుణమని పేర్కొన్నారు. చివరగా 'జైహింద్' అంటూ తన సందేశాన్ని ముగించారు.
పవన్ కళ్యాణ్ త్వరలో తన రాజకీయ పార్టీ చిహ్నాన్ని ప్రకటిస్తారనే వార్తలు వచ్చాయి. ఆయన నిజానికి ఆగస్టు 15వ తేదీననే దాన్ని ప్రకటించాలని అనుకున్నారని, కానీ వీలు పడలేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications