Pawan Kalyan : వారాహి లక్ష్యం ఇదే-క్లారిటీ ఇచ్చేసిన పవన్-దుర్గగుడిలో పూజలు-పొటెత్తిన ఫ్యాన్స్..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ కనకదుర్గ ఆలయంలో ఇవాళ తన వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయించారు. ఉదయం ఇంద్రకీలాద్రికి చేరుకున్న ఆయన్ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ విజయవాడ చేరుకున్నారు. నిన్న కొండగట్టు, ధర్మపురితో పాటు తెలంగాణలో పలు ఆలయాల్ని సందర్శించిన పవన్ తన వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఇవాళ విజయవాడ కనకదుర్గ ఆలయానికి వచ్చారు. ఇంద్రకీలాద్రికి చేరుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఘన స్వాగతం లభించింది. ఆయన్ను చూసేందుకు అభిమానులు భారీగా పోటెత్తారు.

కొండపైన దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్న పవన్ కల్యాణ్.. అనంతరం వారాహి వావనానికి కొండ కిందే పూజలు నిర్వహించారు. కొండపై పూజల అనంతరం కొండ దిగువున ఘాట్ రోడ్డు టోల్ గేట్ వద్ద వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వారాహి టార్గెట్ చెప్పేశారు. రాక్షస పాలన అంతం చేయడమే వారాహి లక్ష్మమని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

pawan kalyan reveals varahi vehicle target in ap-key comments after puja in durga temple

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు పవన్ తెలిపారు. గుడికి వచ్చాను కాబట్టి ఇంతకు మించి రాజకీయ అంశాలపై మాట్లాడబోనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వాహనానికి ప్రత్యేక పూజలు పూర్తి చేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గుడి నుంచి బయటికి వచ్చి రోడ్డుపై కాసేపు వారాహిపై హల్ చల్ చేశారు. అభిమానుల్ని పలకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+