Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రంగా పెళ్లిపై పవన్ ప్రస్తావన వెనుక ? పొత్తుకు జస్టిఫికేషన్ ! రాధా దూకుడుకు బ్రేక్ ?

దివంగత కాపు నేత వంగవీటి రంగా పెళ్లిపై నిన్న మచిలీపట్నం సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కాపుల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.

మచిలీపట్నం : ఏపీలో ఒకప్పుడు కాపు నాయకుడిగా పేరు తెచ్చుకున్న వంగవీటి రంగా విజయవాడలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన చెన్నుపాటి రత్నకుమారిని పెళ్లి చేసుకోవడం ద్వారా తాను ఏ ఒక్క కులానికో, మతానికో పరిమితమైన వాడిని కాదనే సందేశం ఇచ్చారు. ఆయన హత్య జరిగిన దశాబ్దాల తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే విషయాన్ని మరోసారి తన సొంత సామాజిక వర్గమైన కాపులకు గుర్తుచేశారు. తద్వారా ఆయన రెండు విషయాల్లో రాజకీయంగా కూడా ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.

మళ్లీ తెరపైకి వంగవీటి రంగా

మళ్లీ తెరపైకి వంగవీటి రంగా

రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్ధితుల్లో మరోసారి దివంగత వంగవీటి మోహన రంగా పేరు మార్మోగుతోంది. ముఖ్యంగా రంగా కుమారుడు వంగవీటి రాధా చేస్తున్న రాజకీయాలతో ఓ విధంగా ఆయన పేరు మారుమోగుతుండగా.. రాష్ట్రంలో ఈసారి కాపులకు రాజ్యాధికారం కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా కూడా రంగా పేరు వినిపిస్తోంది. రంగా విగ్రహాల పేరుతో వైసీపీ నేతలు చేస్తున్న రాజకీయాలు ఆయన కుమారుడు రాధాకు సానుకూలంగా కనిపిస్తున్నా, మెజారిటీ కాపు సామాజిక వర్గ నేతలు ఈ రాజకీయాన్ని వ్యతిరేకిస్తున్నారు. నిన్న బందరులో జరిగిన జనసేన ఆవిర్భావ సభలోనూ పవన్ కళ్యాణ్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.

రంగాపెళ్లిపై పవన్ కామెంట్స్

రంగాపెళ్లిపై పవన్ కామెంట్స్

ఎప్పుడో దశాబ్దాల క్రితం వంగవీటి రంగాకు ప్రాణహాని ఉందని తెలిసినా ఇక్కడి కాపులు ఆయన్ను రక్షించుకోలేకపోయారని పవన్ వ్యాఖ్యానించారు. అంతే కాదు కాపు సామాజిక వర్గానికి చెందిన రంగా.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన చెన్నుపాటి రత్నకుమారిని పెళ్లి చేసుకుంటే ఆయనకు కానీ, ఆయన కుమారుడు రాధాకు కానీ ఎలాంటి అభ్యంతరాలు లేవని పవన్ చెప్పారు. రాధాయే మౌనంగా ఉంటున్నప్పుడు మీకొచ్చిన అభ్యంతరం ఏంటని కాపు యువతను పవన్ ప్రశ్నించారు. తద్వారా కమ్మ సామాజిక వర్గం తమకు శత్రువులు కాదనే భావనను పవన్ తెరపైకి తెచ్చారు.

టీడీపీ-జనసేన పొత్తుకు జస్టిఫికేషన్ ?

టీడీపీ-జనసేన పొత్తుకు జస్టిఫికేషన్ ?


రాష్ట్రంలో టీడీపీ-జనసేన పొత్తుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటిని కాపు సామాజిక వర్గంలో ఉన్న కొందరు వ్యతిరేకిస్తున్నారు. గతంలో వంగవీటి రంగాను హత్య చేసిన టీడీపీతో పొత్తేంటని వైసీపీ నేతలు పవన్ ను ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వయంగా కాపు నేత అయిన రంగా కమ్మవారి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే రాధాకే అభ్యంతరం లేదని, అలాంటిది మీకెందుకని పవన్ ప్రశ్నించారు. తద్వారా కాపు-కమ్మ కలిస్తే మీకొచ్చిన నష్టమేంటని పవన్ కాపు సామాజికవర్గాన్ని ప్రశ్నించారు. కులాల్ని కలపడమే తమ లక్ష్యమని కూడా చెప్పేశారు. తద్వారా టీడీపీతో పొత్తును కులం కోణంలో చూడొద్దని పవన్ తేల్చిచెప్పేశారు.

రాధా దూకుడుకు బ్రేక్ ?

రాధా దూకుడుకు బ్రేక్ ?

ఈ మధ్య కాలంలో వైసీపీలో ఉన్న తన స్నేహితుల ఒత్తిడితో వంగవీటి రాధా తన తండ్రి విగ్రహాలు ఎక్కడ ప్రతిష్టించినా అక్కడికి వెళ్లి వాటికి ప్రారంభోత్సవాలు చేసి వస్తున్నారు. అలాగే రాష్ట్రంలో కాపు నేతగా తన తండ్రి తరహాలో బలమైన ముద్ర వేయించుకునేందుకు రాధా తహతహలాడుతున్నట్లు కనిపిస్తోంది. దీనికి వైసీపీ వంటి పార్టీలు కూడా మద్దతుగా నిలుస్తున్నాయి. ఇది చూసి టీడీపీ నేతలు కూడా తమ పార్టీకి కాపుల మద్దతు ముద్ర మంచిదేనన్న భావనలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రాధా దూకుడుకు బ్రేక్ వేసేందుకు పవన్ కళ్యాణ్ రంగా పెళ్లి అంశాన్ని నిన్న బందరు సభలో ప్రస్తావించారనే చర్చ జరుగుతోంది. కాపు-కమ్మ తల్లితండ్రులకు పుట్టిన రాధాకు లేని అభ్యంతరం మీకెందుకని పవన్ వేసిన ప్రశ్న ఇప్పుడు సొంత సామాజిక వర్గంలో పెద్ద చర్చకే కారణమవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+