పవన్ కల్యాణ్ ఆఖరి సినిమా?
జనసేన పార్టీని ఏర్పాటు చేసిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీచేయబోతున్నారు. భారతీయ జనతాపార్టీని కూడా కలుపుకొని వెళ్లి అధికార వైసీపీని ఓడించాలనే లక్ష్యంతో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు దగ్గరయ్యేందుకు, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వారాహి యాత్రను ప్రారంభించారు. యాత్రకు ఊహించనిరీతిలో స్పందన వస్తోంది. రాబోయేది ఎన్నికల కాలం కాబట్టి యాత్రను ఎక్కడా నిలిపివేయకుండా ఎన్నికలు జరిగేంతవరకు కొనసాగించాలని పార్టీ క్యాడర్ కోరుతోంది.
వారాహి యాత్రలో భాగంగా విశాఖపట్నంలో ప్రసంగించిన పవన్ కల్యాణ్ గతంలోని విషయాలను గుర్తుచేసుకున్నారు. తాను సుస్వాగతం సినిమా చేసేటప్పుడు జగదాంబ సెంటర్ లో బస్సుపై డాన్స్ వేశానన్నారు. అయితే తనకు నలుగురిలో అలా డాన్స్ వేసినందుకు సిగ్గేసిందని, వెంటనే తన వదినకు ఫోన్ చేసి తనను సినిమాల్లోకి ఎందుకు పంపించావని అడిగానన్నారు. ఇదే తన ఆఖరి సినిమా అని చెప్పేశానని, ఇంక సినిమాలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నానన్నారు.

అయితే ఈ మాటలను కొందరు ప్రస్తుత రాజకీయాల కోసం చేస్తున్న సినిమాలను ఆపేశారని, షూటింగ్ దశలో ఉన్న హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలే చివరవని ప్రచారం చేయడం ప్రారంభించారు. వాస్తవానికి పవన్ సుస్వాగతం సినిమా సమయంలో జరిగిన సంఘటనను తన వారాహి యాత్రలో భాగంగా చెప్పారు. దీంతో పవన్ కల్యాణ్ సినిమాలు మానేస్తున్నాడని, ఇదే ఆఖరు సినిమా అంటూ వార్తలు వచ్చాయి. అయితే సినిమాల్లో ఇక నటించకూడదంటూ పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది. అయితే జరిగిన విషయం తెలుసుకున్న అభిమానులు హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications