వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందుకే రాలేకపోతున్నా, మడమ తిప్పను.. మేం సిద్ధం: పవన్ కళ్యాణ్

అనివార్య కారణాల వల్ల 'ఉత్తరాంధ్ర వెనుకబాటు-ప్రజల ఆకాంక్ష' కార్యక్రమానికి తాను రాలేకపోతున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: అనివార్య కారణాల వల్ల 'ఉత్తరాంధ్ర వెనుకబాటు-ప్రజల ఆకాంక్ష' కార్యక్రమానికి తాను రాలేకపోతున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు.

ఈ రోజు ఏయూలో జరిగిన భేటీకి సిపిఎం మధు, లోక్‌సత్తా జేపీ, కొణతాల రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం ఉంది. కానీ రాలేకపోయారు. దీంతో తాను అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నట్లు తెలిపారు.

బిజీ షెడ్యూల్ కారణంగా రాలేకపోతున్నట్లు తెలిపారు. జనసేన తరఫున దుర్గాప్రసాద్‌ను పంపించారు. అదే సమయంలో ఉత్తరాంధ్ర, ప్రత్యేక హోదాపై స్పందించారు. ఉత్తరాంధ్ర పోరాటాలకు పుట్టినిల్లు అని పవన్ కళ్యాణ్ అన్నారు.

<strong>జనసేనలో పవన్ కళ్యాణ్‌కు ఎలాంటి హోదా ఉండదా?</strong>జనసేనలో పవన్ కళ్యాణ్‌కు ఎలాంటి హోదా ఉండదా?

ప్రణాళికాబద్ధమైన ప్లాన్ లేకనే

ప్రణాళికాబద్ధమైన ప్లాన్ లేకనే

ఉత్తరాంధ్ర విషయంలో ప్రణాళికాబద్దమైన అభివృద్ధిపై దృష్టి పెట్టక పోవడమే వెనుకబాటుకు కారణమని వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై జనసేన ఉద్యమిస్తుందన్నారు. తొలి ప్రయత్నంగా ఉద్దానం కిడ్నీ బాధితులకు అండగా నిలబడ్డామని చెప్పారు.

పోరాటానికి సిద్ధం

పోరాటానికి సిద్ధం

ఉత్తరాంధ్ర వెనుకబాటుపై పోరాడేందుకు సిద్ధమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ వంటి వెనుకబడిన ప్రాంతాలను ఎంతగానో అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పవన్ వ్యాఖ్యానించారు.

మడమ తిప్పేది లేదు

మడమ తిప్పేది లేదు

ప్రత్యేక హోదాతోనే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో జనసేన పార్టీ మడమతిప్పేది లేదని తేల్చి చెప్పారు.

పవన్ పర్యటన తర్వాత..

పవన్ పర్యటన తర్వాత..

'ఉత్తరాంధ్ర వెనుకబాటు-ప్రజల ఆకాంక్ష' సభలో సిపిఎం మధు మాట్లాడారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుపై ప్రభుత్వం చర్యలు శూన్యం అన్నారు. కరువుతో అల్లాడుతున్న శ్రీకాకుళంను గాలికి వదిలేశారన్నారు.

ఉత్తరాంద్ర వెనుకబాటుపై మహానాడులో టిడిపి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్ధానంలో పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత స్పందించిన ప్రభుత్వం.. ఇప్పటి వరకు లీటర్ మినరల్ వాటర్ కూడా సరఫరా చేయలేదన్నారు.

English summary
Jana Sena chief Pawan Kalyan talks about Uttarandhra development on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X