వాళ్లు 11 మంది ఉన్నా 1100 మంది ఉన్నట్టు - పవన్ కీలక వ్యాఖ్యలు..!!

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. వైసిపి సభ్యులు 11 మంది ఉన్నా 1100 మంది ఉన్నట్టు మాట్లాడతారన్నారు. వాళ్లు చెప్పేది బలంగా నమ్ముతారని.. మనం ఎందుకో చేసింది చెప్పుకోలేక పోతున్నామని పేర్కొన్నారు. కూటమి నేతలు ఏకాభిప్రాయం తో ఉండాలని సూచించారు. వాళ్ళతో పోలిస్తే కూటమి ప్రభుత్వం చాలా బాధ్యతాయుతంగా ఉందని చెప్పారు. కూటమి లో పార్టీ లు కలిసి కట్టుగా ఉండాలని.. 15 ఏళ్ళు రాష్ట్రం కోసం పాటు పడదామని అసెంబ్లీ వేదికగా పిలుపునిచ్చారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వైసీపీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ద్రవ్య వినిమయ బిల్లు పైన మాట్లాడిన పవన్... ప్రభుత్వం చేస్తున్నది ప్రజలకు ఎలా చెప్పాలో ఆలోచన చేయాలన్నారు. లేకపోతే.. మనం ఎంత గొప్ప బడ్జెట్ లు పెట్టినా ప్రయోజనం లేదని పేర్కొన్నారు. కూటమి లో పార్టీ లు వేరు వేరు కుల సమూహాలు నుంచి వచ్చాయని చెప్పారు. ఇక..
రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ కల ఆర్టికల్ 21ని వైసీపీ నేతలు వాళ్ళ పక్కవాళ్ళ జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టడం, స్వేచ్ఛను హరించడం ప్రాధమిక హక్కని అనుకుంటున్నారని మండిపడ్డారు. వాళ్ళ ఆలోచనా విధానం సరిచేయాలన్నారు. వాళ్లే కల్తీ చేసి, మనం చేశామని చెప్తారని వ్యాఖ్యానించారు. విభిన్నమైన కుల సమూహాలనుంచి వచ్చిన మనం అంతా కలిసి ఐక్యంగా ఉంటే కానీ వాళ్ళను మార్చలేమని పవన్ చెప్పుకొచ్చారు.

pawan-kalyan-targets-ysrcp-big-appeal-for-nda-alliance-leaders-in-the-assembly-here-the-details

కలిసి కట్టుగా ఉండాలని కూటమి నేతలకు సూచన

ఇష్టం వచ్చినట్టు వైసిపి తిట్టి..కులాల వెనక దాక్కుంటున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. అదే విధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి నేతలందరం ఐక్యంగా ముందుకెళ్దామని చెప్పారు. కూటమి చాలా బలంగా ఉండాలనేది తన ఆకాంక్ష అని ఉద్ఘాటించారు. ఏపీ అభివృద్ధి కోసమే 2014లో అలయన్స్ కోసం కష్టపడ్డానని తెలిపారు. 2019లో అది సాధ్యం కాలేదని.. 2024లో మరోసారి వెనక్కు తగ్గి పొత్తు పెట్టుకున్నానని ప్రస్తావించారు. ప్రజల ఆకాంక్షలు, ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలంటే మనలో ఏదైనా చిన్నచిన్న సమస్యలున్నా సర్దుకోవాలని దిశానిర్దేశం చేశారు. రాజ్యాంగంలోని మూడు వ్యవస్థలు పరస్పర సహకారంతో పని చేయాలని తెలిపారు. ఏ వ్యవస్థలో లోపాలు ఏర్పడినా ప్రజలకు సేవ చేయటంలో ఇబ్బందులు వస్తాని పేర్కొన్నారు. జగన్ అండ్ కోను కుట్రలను ఎదుర్కోవాలంటే మనం కలిసి ఉండాలని సూచించారు. నియోజక వర్గాల వారీగా తన శాఖల తరపున ఇచ్చిన నిధుల వివరాలు అందజేస్తున్నానని తెలిపారు. బడ్జెట్ వస్తుందంటే ప్రతి ఒక్కరూ ఎన్నో ఆశలుపెట్టుకుంటారని చెప్పుకొచ్చారు. 15సంవత్సరాలు ఈ రాష్ట్రం కోసం కూటమి పని చేస్తుందని వ్యాఖ్యానించారు. న్యాయశాఖకు సరిపడా నిధులు బడ్జెట్‌లో కేటాయించాలని కోరుతున్నామని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+