వాస్తు ప్రకారం మెట్ల కింద ఎంతమాత్రం ఉంచకూడని వస్తువులు

ఇంటి నిర్మాణ సమయంలో వాస్తు నియమాలను పాటించడం అత్యంత కీలకం. సరైన పద్ధతిలో గృహాన్ని నిర్మించుకోవడం వల్ల ఆ ఇంట నివసించే కుటుంబ సభ్యుల జీవితాల్లో సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయిని నమ్ముతారు. చాలామంది ఇల్లు కట్టేటప్పుడు స్థలాన్ని ఆదా చేయాలనే ఉద్దేశంతో వాస్తు విషయంలో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ముఖ్యంగా మెట్ల కింద ఉండే ఖాళీ స్థలాన్ని వాడే విషయంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు వాస్తు దోషాలకు దారితీస్తాయి.

మెట్ల కింది భాగాన్ని చాలామంది స్టోర్ రూమ్ లుగా మార్చుకోవడం మనం తరచూ చూస్తుంటాం. వాస్తు ప్రకారం ఇది దోషంగా పరిగణిస్తారు. ఇంట్లో పనికి రాని వస్తువులను అక్కడ ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరిగిపోతుంది. ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఆందోళనలు, కుటుంబ సభ్యులలో నిరంతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే మెట్ల కింద ఉన్న ఖాళీ స్థలాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఏ వస్తువులు ఉంచవచ్చు, వేటికి దూరంగా ఉండాలనే అవగాహన ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం.

Staircase Under Space Dos and Don ts as per Vastu Declutter Under the to Invite Progress and Wealth

వాస్తు ప్రకారం మెట్ల కింద ఉన్న ఖాళీ ప్రదేశాన్ని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అక్కడ బరువైన వస్తువులను ఉంచకూడదు. తేలికపాటి చిన్న చిన్న సామాగ్రిని మాత్రమే భద్రపరుచుకోవాలి. ఆ స్థలాన్ని వీలైనంత వరకు అందంగా మార్చేందుకు ప్రయత్నించాలి. తక్కువ కాంతిని ప్రసరింపజేసే విద్యుత్ దీపాలు షోపీస్ లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది ఇంటి వాతావరణంలో సానుకూల శక్తి నిరంతరాయంగా ప్రవహించేలా చేయడమే కాకుండా ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చుతుంది.

కేంద్రం వద్ద 2,530 కి. మీ. రేంజ్ మిస్సైల్- హిందూ మహాసముద్రంపై: గజ గజ
కేంద్రం వద్ద 2,530 కి. మీ. రేంజ్ మిస్సైల్- హిందూ మహాసముద్రంపై: గజ గజ

మెట్ల కింద తగినంత గాలి, వెలుతురు వచ్చే సదుపాయం ఉంటే, అక్కడ చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవచ్చు. ఇది ఆ ప్రాంతంలో ఉండే వాస్తు దోషాలను నివారిస్తుంది. ఆ స్థలాన్ని వృథా చేయకుండా ఒక చక్కటి బుక్ షెల్ఫ్ లేదా చిన్న పిల్లల స్టడీ కార్నర్‌గా మార్చుకోవచ్చు. అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ దుమ్ము, ధూళి చేరకుండా రోజూ క్రమం తప్పకుండా శుభ్రం చేయడం మాత్రం మరిచిపోకూడదు.

తిరుపతి పద్మావతి మహిళా కళాశాల హాస్టల్ నిర్వహణపై అసత్య ప్రచారాలు: టీటీడీ
తిరుపతి పద్మావతి మహిళా కళాశాల హాస్టల్ నిర్వహణపై అసత్య ప్రచారాలు: టీటీడీ

మెట్ల కింద ఎప్పుడూ డబ్బులు దాచే బీరువాలు, సేఫ్‌లు లేదా లాకర్లు పెట్టకూడదు. దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతుంది. చాలా ఇళ్లల్లో స్థలం కొరత వల్ల మెట్ల కింద భాగంలో దేవుడి రూమ్ లేదా పూజా మందిరాన్ని నిర్మిస్తుంటారు. వాస్తుపరంగా ఇలా చేయడం తప్పు. మెట్ల కింది భాగంలో పూజాగదిని ఉంచితే ఫలితం దక్కకపోగా ఇంట్లో ప్రశాంతత సైతం భంగమవుతుంది. అక్కడ వంటగది లేదా గ్యాస్ స్టవ్ ఉంచకూడదు. మెట్ల కింద అటాచ్డ్ బాత్‌రూమ్స్ లేదా టాయిలెట్లు నిర్మించడం కూడా వాస్తు దోషంగానే పరిగణిస్తారు.

పాత, పగిలిన వస్తువులు, చెప్పులు, కట్టెల వంటి చెత్తను అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకూడదు. ఇంటి శ్రేయస్సు, కుటుంబ సభ్యుల అభ్యున్నతి అనేవి మెట్ల కింద ఉన్న ఖాళీ స్థలాన్ని మనం ఎంత ప్రణాళికాబద్ధంగా వాడుకుంటామనే దానిపై కూడా ఆధారపడి ఉంటాయి. అక్కడ అనవసరమైన సామాగ్రిని ఉంచకుండా వాస్తు నియమాలకు అనుగుణంగా తగిన మార్పులు చేసుకోవడం అవసరం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+