Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

‘థాంక్యూ ఆల్’ అంటూ పవన్ కళ్యాణ్ స్పెషల్ పోస్ట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో తనకు గెలుపునకు మద్దతుగా శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు జనసేన సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రకటన విడుదల చేశారు.

సార్వత్రిక ఎన్నికల్లో జనసేన సాధించిన అఖండ విజయాన్ని అభినందిస్తూ చాలా మంది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రైతులు, కార్మికులు, పారిశ్రామిక వేత్తలు, సామాజిక వేత్తలు, విద్యావంతులు, మేధావులు, మహిళలు, యువత.. ఇలా అందరూ ఈ విజయంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Pawan Kalyan thanks for his supporters and well wishers

తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖ కథనాయకులు, నటులు, నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు చెప్పారు. తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, హిందీ చిత్ర పరిశ్రమలకు చెందిన శ్రేయోభిలాషులు తమ ఆనందాన్ని వెలిబుచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సాధించిన విజయాన్ని స్వాగతిస్తూ అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు పవన్ కళ్యాణ్.

ఈ విజయం తమ అందరిపై బాధ్యతను మరింత పెంచిందన్నారు జనసేనాని. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ముందడుగు వేస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాగా, ఏపీలో ఎన్డీఏ కూటమి ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఏపీలో మొత్తం 25 ఎంపీ స్థానాల్లో ఎన్డీఏ కూటమి 21 సీట్లను గెలుచుకుంది. ఇక, ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 164 ఎమ్మెల్యే సీట్లలో విజయం సాధించింది. దీంతో మరో వారం రోజుల్లోగా ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+