రాజమండ్రిలో పవన్ కళ్యాణ్: రైతులకు పరామర్శ, అండగా ఉంటామంటూ భరోసా
తూర్పుగోదావరి: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కడియం అవలో అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతాంగాన్ని పరామర్శించారు పవన్. మొలకలు వచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు. మీరు వస్తున్నారనే ధాన్యం కొనుగోలు వేగవంతం చేశారని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు పలువురు రైతులు తెలిపారు.
ఇంకా కోతలు కోయాల్సి ఉందని.. గోనె సంచులు కూడా ఇవ్వడం లేదని రైతులు పవన్ కళ్యాణ్‌కు గోడు వెళ్లబోసుకున్నారు. నూక, ట్రాన్స్‌పోర్ట్ పేరుతో రైతులని మిల్లర్లు దోచేస్తున్నారని పవన్ ముందు రైతులు కంటతడి పెట్టారు. దిక్కుతోచని పరిస్థితుల్లోనే తక్కువ ధరకు ధాన్యం అమ్ముకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టం వివరాలను, రైతుల సమస్యలను పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు.

రాజమండ్రి నగరం, బొమ్మూరు, రాజవోలు మీదుగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని ఆవ భూములలో దెబ్బతిన్న వ్యవసాయ భూములు పరిశీలించి రైతులను పరామర్శించారు పవన్ కళ్యాణ్. అకాల వర్షాలతో పంటకు తీవ్ర నష్టం జరిగిందని రైతులు వాపోయారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని అన్నారు. రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని పవన్ కళ్యాణ్ రైతులకు భరోసా ఇచ్చారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
#PawanKalyan garu with farmers today at Kadiyam 🌾 #JSPWithAPFarmers #PawanKalyan pic.twitter.com/lo0MBcwzZV
— Gopal Karneedi (@gopal_karneedi) May 10, 2023
అనంతరం వేమగిరి, జొన్నాడ, రావులపాలెం, కొత్తపేట మీదుగా అవిడి చేరుకుని నష్టపోయిన రైతులతో మాట్లాడనున్నారు. ఆ తర్వాత పి. గన్నవరం నియోజకవర్గం రాజుపాలెం ప్రాంతానికి వెళ్లి. రైతులను పరామర్శించనున్నారు. పవన్ కళ్యాణ్ వెంట జనసేన పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ ఉన్నారు.
అంతకుముందు రాజమండ్రి విమానాశ్రయం చేరుకున్న పవన్ కళ్యాణ్‌కు జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికారు.












Click it and Unblock the Notifications