ముందే పవన్, చలించిన మోడీ: 36 గంటలు దాటినా...

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బుధవారం విశాఖలో పర్యటించనున్నారు. హుధుద్ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ప్రజలను పరామర్సిస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం మధ్యాహ్నం విశాఖలో పర్యటించిన విషయం తెలిసిందే. విశాఖ ప్రజలకు అండగా ఉంటామని, కష్టకాలంలో ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలబడ్డారని మోడీ కితాబిచ్చారు. ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు. పరిస్థితిని చూసి మోడీ చలించిపోయారు.

హుధుద్ తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరాన్ని కకావికలం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీకి సాయం చేసేందుకు తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు కూడా ముందుకు వచ్చాయి. తెలుగు సినీ పరిశ్రమ కూడా పెద్ద మొత్తంలో సాయం చేసేందుకు ముందుకు వచ్చింది.

టాలీవుడ్ నటులు వ్యక్తిగతంగా లక్షలాది రూపాయలు సాయం చేశారు. పవన్ కళ్యాణ్ అందరికంటే ఎక్కువగా రూ.50 లక్షల సాయాన్ని ప్రకటించారు. కాగా మంగళవారం సాయంత్రం వరకు పలువురు యువ హీరోలు, సీనియర్ నటులు స్పందించి విరాళం ఇచ్చారు. ఇంకా కొందరు ఇప్పటి వరకు స్పందించక పోవడం పైన గుసగుసలాడుకుంటున్నారంటున్నారు.

36 గంటలు దాటినా...

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ రాకముందే మంగళవారం హుధుద్ ప్రభావిత ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించారు. విశాఖలో ఆయన మాట్లాడారు.

 నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

పెను తుఫానును ధైర్యంగా ఎదుర్కొన్న విశాఖవాసులను ఆయన అభినందించారు. కొద్ది రోజులలోనే పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని చెప్పారు.

 నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

తుపాను బాధిత ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలకు గాను తక్షణ సాయం కింద మోడీ ఆంధ్రప్రదేశ్‌కు రూ.వెయ్యి కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు.

 నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు ప్రభుత్వానికి సహకరించారన్నారు. సాధారణ పరిస్థితి నెలకొనే వరకు విశాఖ వాసులకు అండగా ఉంటానని చెప్పారు.

 నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అండగా నిలబడతామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కట్టుగా పని చేశాయని, ప్రభుత్వాల సమన్వయం వల్ల తుఫాను నష్టం చాలా తగ్గిందన్నారు.

హుధుద్ తుఫాను తీరం దాటి దాదాపు 36 గంటలు దాటినా ఉత్తరాంధ్ర, విశాఖలో పరిస్థితి పూర్తిగా సద్దుమణగలేదు. మంగళవారం సాయంత్రం నాటికి కొద్దిగా సమస్య తీరినప్పటికీ.. ఇంకా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరుకుల కోసం ప్రజలు కటకట పడుతున్నారు. ధరలు భారీగా పెరిగిపోయాయి.

ధరల పెరుగుదల పైన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పరిస్థితిలో కొంత మార్పు వచ్చిందని అంటున్నారు. పెట్రోల్ కోసం వాహనదారులు బారులు తీరారు. ఆహార పదార్థాల కోసం ప్రజలు ఎగబడుతున్నారు. వారిని పోలీసులు అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

26 మంది మృతి

హుధుద్ తుపాను ధాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో మృతి చెందిన వారి సంఖ్య 26కి చేరుకుంది. ఒడిశాలో ముగ్గురు మరణించారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు నష్టపరిహారం 1.50 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచింది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. దీంతో మృతుల కుటుంబాలకు ఏడు లక్షల రూపాయల అందనున్నాయి.

ప్రధాని గుర్తించారు: పరకాల

మోడీ పర్యటన అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. తుపాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని మోడీ గుర్తించారన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం ద్వారా నష్టం తగ్గించగలిగారని మోడీ చెప్పారన్నారు.

స్మార్ట్ సిటీ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని పునరుద్ధరణ పనులు చేపట్టాలని ప్రధాని సూచించారని, విద్యుత్ పునరుద్ధరణపై అడిగి తెలుసుకున్నారన్నారు. విశాఖలో విద్యుత్ వ్యవస్థల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. రేపు సాయంత్రం కల్లా నీటి సరఫరా పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారన్నారు.

విరాళాల వెల్లువ

హుధుద్ తుఫాను ఏపీని కకలావికలం చేసిన నేపథ్యంలో విరాళాలు వెల్లువెత్తాయి. తమిళనాడు ప్రభుత్వం రూ.5 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది. విద్యుత్ స్తంభాలు, ఇతర ఉపకరణాలు ఇవ్వాలు పంపించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా రూ.18 కోట్ల విలువైన విద్యుత్ ఉపకరణాలు పంపించింది. విద్యుత్తు సరఫరా పునరుద్ధరణకు సుమారు రెండు వేల మంది ఇంజినీర్లు, ఇతర సాంకేతిక సహాయ సిబ్బందిని ఏపీకి పంపిస్తామని కర్నాటక విద్యుత్తు శాఖ మంత్రి డీకే శివకుమార్ సోమవారం ప్రకటించారు.

హుధుద్ తుపాను బాధితుల సహాయార్థం తానా అధ్యక్షుడు నన్నపనేని మోహన్ భారీ ఆర్థిక సాయం ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.60 లక్షలు విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ, మహేష్ బాబులు తమ వంతు సాయం ప్రకటించారు. నిర్మాతల మండలి కూడా ప్రస్తుతం రూ.25 లక్షలు ఇచ్చింది.

భారీ నష్టం

హుధుద్ వల్ల వేలాది కోట్ల రూపాయల నష్టం జరిగినట్లుగా అంచనాకు వచ్చారు. వెయ్యి కోట్ల రూపాయల వరకు నష్టం జరిగినట్లుగా ప్రాథమికంగా అంచనా వేశారు. దక్షిణ మధ్య రైల్వేకు రూ. 15.6 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 94 రైళ్లు రద్దు కాగా 19 రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయని తెలిపింది. 74 దూర ప్రాంత రైళ్లను మళ్లించినట్లు చెప్పారు.

5.58 లక్షల మంది ప్రయాణీకులు ప్రయాణం రద్దు చేసుకున్నారన్నారు. రద్దు చేసుకున్న, రిజర్వేషన్ చేయించికునన్న 54వేల మందికి రూ.1.40 కోట్లు తిరిగి చెల్లించామని పేర్కొన్నారు. మరోవైపు, తుపాను ప్రభావిత ప్రాంతాలైన విశాఖపట్టణం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆర్టీసీ బస్సు సేవలను చాలా వరకు పునరుద్ధరించామని ఆర్టీసీ తెలిపింది. విశాఖలో 19వ తేదీ వరకు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+