పవన్ కళ్యాణ్‌ను చులకన చేయడం లేదు: యనమల వెటకారంపై పత్తిపాటి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని భూసేకరణకు సంబంధించి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కి ఉన్న అభ్యంతరాలను నివృత్తి చేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. రాష్ట్రంలో తమ తెలుగుదేశం పార్టీ విజయం కోసం శ్రమించిన పవన్ కల్యాణ్ అంటే తమకందరికీ అభిమానం, గౌరవం ఉందని, పవన్ కళ్యాణ్‌ను చులకన చేయడం లేదనిని అన్నారు.
భూసేకరణకు సంబంధించి యనమల రామకృష్ణుడు వెటకారంగా మాట్లాడారని పవన్ కల్యాణ్ ట్విట్టర్‌లో పేర్కొనడంపై ప్రత్తిపాటి గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ విధంగా స్పందించారు. ప్రజా రాజధాని నిర్మాణం కోసమే భూసేకరణకు వెళుతున్నామని చెప్పారు. ఇప్పటికే 33 వేల ఎకరాలు సమీకరించామని, మరో 2200 ఎకరాలకు సంబంధించి రైతులు ముందుకు రాకపోవడంతో భూ సేకరణకు నోటిఫికేషన్ ఇస్తున్నట్లు చెప్పారు.

98 శాతం మంది భూములు ఇచ్చారని, రెండు శాతం మాత్రమే వ్యతిరేకిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో మెజార్టీ అభిప్రాయం ప్రకారమే ఎవరైనా ముందుకు వెళ్లాల్సి ఉంటుందని అన్నారు. పవన్‌కి అవగాహనలేక భూసేకరణను వ్యతిరేకిస్తున్నారా అనే ప్రశ్నకు స్పందిస్తూ... తన అభిప్రాయం అది కాదని చెప్పారు. అయితే ప్రతి మనిషి జీవితాంతం నేర్చుకుంటున్నా 20-30 శాతమే తెలుసుకోగలుగుతారని అన్నారు.
భూమి ఇవ్వడం ఇష్టంలేని తాడేపల్లి, మంగళగిరి ప్రాంతంలోని రైతులు పవన్‌ను కలుస్తున్నారని చెప్పారు. వారు సహజంగానే తమకు అనుకూలంగా చెప్పుకోవడంవల్ల పవన్ కల్యాణ్ భూసేకరణకు వ్యతిరేకంగా మాట్లాడి ఉంటారని అన్నారు. అందుకే పవన్ కల్యాణ్‌ని కలిసి అన్ని విషయాలు చెబుతామని చెప్పారు. తుళ్లూరు మండలంలోని 700 ఎకరాలకు ఆ జిల్లా కలెక్టర్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేయనున్నారని చెప్పారు.
మిగిలిన 1500 ఎకరాలకు ఐదు రోజుల తరవాత నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. కాగా, ప్రపంచంలోనే మేటి రాజధానిని నిర్మించబోతున్నామని చెబుతూ దయచేసి ఈ బృహత్తర కార్యానికి అడ్డుపడవద్దని మంత్రి రావెల పవన్ కల్యాణ్‌కి విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications