ధవళేశ్వరం బ్రిడ్జిపై జనసేన కవాతు: పవన్ పిలుపు
అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 15న రాజమండ్రి ధవళేశ్వరం బ్రిడ్జిపై కవాతు నిర్వహించాలని నిర్ణయించారు. అక్టోబర్ 9న కొవ్వూరు నుంచి ప్రారంభించి రాజమండ్రి వరకు కవాతు నిర్వహించనున్నారు.

శనివారం 13 జిల్లాల జనసేన పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్న పవన్ ఆదివారం పోలవరం ప్రాజెక్టును సందర్శించి పరిశీలించాలని నిర్ణయించారు. శుక్రవారం రాత్రి విజయవాడలోని పార్టీ కార్యాలయంలో తూర్పు గోదావరి జిల్లా నేతలతో పవన్ సమావేశమయ్యారు.
సేన, సిద్ధం కండి! అక్టోబర్ 15న ధవళేశ్వరం బ్యారేజీపై జనసేన భారీ కవాతు.#JanaSenaPorataYatra pic.twitter.com/hNpHmZqlIu
— JanaSena Party (@JanaSenaParty) October 5, 2018
పార్టీని బలోపేతం చేయడం, ఇతర విషయాలపై ఈ సందర్భంగా చర్చించారు. విజయనగరం జిల్లాకు చెందిన వివిధ పార్టీల నేతలు పవన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.












Click it and Unblock the Notifications