జనసేన నేతకు అల్లుడుగా రాధా - ఆ నేతలే మధ్యవర్తిత్వం..!!
టీడీపీ నేత వంగవీటి రాధా పెళ్లి ఖాయమైంది. అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. రాధా వివాహం ఖరారు కావటంతో వధువు ఎవరనే ఆసక్తి రాజకీయంగా కనిపించింది. వంగవీటి రాధా ఒక యోగా టీచర్ ను వివాహమాడుతున్నారు. వధువు తండ్రి జనసేన నేతగా ఉన్నారు. ఈ నెల 19న నిశ్చితార్దం చేయాలని నిర్ణయించినా వాయిదా పడింది. సెప్టెంబర్ 6న వంగవీటి రాధా వివాహం కు ముహూర్తంగా నిర్ణయించారు.
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా నర్సాపురం అల్లుడు కాబోతున్నారు. నరసాపురానికి చెందిన జక్కం బాబ్జి అమ్మాని దంపతుల చిన్న కుమార్తె పుష్పవల్లి తో వంగవీటి రాధా వివాహం ఖరారైంది. పుష్పవల్లి తల్లి జక్కం అమ్మాని 1987-92 వరకు నరసాపురం మున్సిపాలిటీ టిడిపి చైర్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించారు. పుష్పవల్లి స్కూల్, కాలేజ్ విద్యాభ్యాసం అంతా నరసపురంలోనే జరిగింది. ఉన్నత విద్య హైదరాబాడ్ లో పూర్తి చేసారు. హైదరాబాద్ లో యోగా టీచర్ గానూ పని చేసారు. ప్రయివేటు పాఠశాలల్లో పని విధులు నిర్వహిస్తున్నారు.

వధువ తండ్రి టీడీపీ లో సుదీర్ఘ కాలం పోషించారు. మధ్యలో కొంత కాలం హైదరాబాద్ కు వెళ్లిపోయారు. తిరిగి నర్సాపురం వచ్చి అక్కడే ఇంటి నిర్మాణం చేపట్టారు. కొంత కాలం క్రితం జనసేనలో చేరారు. రాజకీయంగా తిరిగి యాక్టివ్ అయ్యారు. గత నెలలో పవన్ కల్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల్లొ వారాహి యాత్ర సమయంలో నర్సాపురంలో ఉన్న సమయంలో వీరి ఇంటిలోనే బస చేసారు. ఆ సమయంలో తమ కుమార్తె వివాహం విషయం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు. వంగవీటి రంగా జయంతి సమయంలోనూ రాధా వీరి ఇంటికి వచ్చారు. నర్సాపురంలో జరిగిన రంగా జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో రెండు వైపులా వివాహ సంబంధం గురించి నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
నర్సాపురానికి చెందిన జనసేన ఇన్‌ఛార్జ్ నాయకర్, మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు సైతం వంగవీటి రాధా వివాహం ఖరారు సమయంలో మధ్యవర్తిత్వం వ్యవహరించినట్లు తెలుస్తోంది. తొలుత ఈ నెల 19న నిశ్చితార్దం చేయాలని నిర్ణయించారు. అయితే కొన్ని కారణాలతో అది వాయిదా పడినట్లు తెలుస్తోంది. త్వరలోనే మరో ముహూర్తం ఖరారు చేయనున్నారు. వివాహం ముహూర్తం ఖరారు కావటంతో పెళ్లి.. తరువాత ఆరు నెలల కాలంలోనే ఎన్నికల్లో పోటీ ద్వారా వంగవీటి రాధా అటు వైవాహిక జీవితం..రాజకీయంగానూ కొత్త అడుగులు వేయటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications